Helle Lyng: ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు హెల్లీ లింగ్ ఎవరో తెలుసా?
Helle Lyng: నార్వే జర్నలిస్టు హెల్లి లింగ్.. ఓ డిప్లమాటిక్ బ్రీఫింగ్లో ప్రధాని మోదీని ప్రశ్నించారు. కానీ ఆ ప్రశ్నకు మోదీ జవాబు ఇవ్వలేదు. దీంతో ఆమె తన ట్వీట్లో ఆ విషయాన్ని రాశారు. పత్రికా స్వేచ్ఛ అంశంపై చర్చను లేవనెత్తారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
ఓస్లో: ప్రధాని మోదీ ఇటీవల నార్వేలో పర్యటించారు. అయితే నార్వేకు చెందిన జర్నలిస్టు హెల్లి లింగ్(Helle Lyng) .. ప్రధాని మోదీకి ఓ ప్రశ్న వేశారు. ఓ సమావేశంలో పాల్గొని వెళ్తున్న మోదీని ఆమె ప్రశ్నించారు. కానీ ఆ ప్రశ్నకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వలేదు. ఆ జర్నలిస్టు హెల్లి లింగ్పై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమె ట్రోల్ అవుతోంది. ఇండియాలో పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మీడియా యాక్సిస్ గురించి విస్తృతంగా చర్చిస్తున్నారు.
ఓస్లోకు చెందిన డగ్సావిసెన్ అనే పత్రికలో హెల్లి లింగ్ పనిచేస్తున్నది. మోదీ నార్వే విజిట్‌ను కవర్ చేసే బృందంలో ఆమె కూడా ఉన్నది. అయితే ఓ మీటింగ్‌లో ఆమె ప్రధాని మోదీని ప్రశ్నించారు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మోదీ వెళ్లిపోయారు. దీని గురించి ఆమె ఓ ట్వీట్ చేసింది. ప్రధాని మోదీ తన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని ఆమె రాసుకున్నది. ప్రధాని మోదీ ఇలా చేస్తారనుకోలేదని ఆమె పేర్కొన్నది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్ వివరాలను ఆమె గుర్తు చేశారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడం సూచీలో నార్వే ఫస్ట్ ఉన్నట్లు లింగ్ పేర్కొన్నది. ఇక ఇండియా ర్యాంక్ 157వ స్థానంలో ఉన్నది. పాలస్తీనా, ఎమిరేట్స్, క్యూబాతో ఇండియా పోటీపడుతున్నట్లు పేర్కొన్నది. తమ ప్రభుత్వంతో సహకరించే అధికారులను ప్రశ్నించడం తన కర్తవ్యం అని ఆమె తెలిపింది.
ఇక భారత విదేశాంగ మంత్రిత్వశాఖ నిర్వహించిన మీడియా సమావేశంలోనూ లింగ్ మళ్లీ ప్రశ్నలు కురిపించారు. భారత్‌లో ఉన్న ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ, మానవ హక్కుల గురించి ఆమె ప్రశ్నించారు. అంతర్జాతీయ సమాజం ఇండియాను ఎందుకు నమ్మాలని ఆమె అడిగారు. సంక్లిష్టమైన అంశాల్లో ప్రధాని మోదీ స్పందించడం లేదని ఆమె ఆరోపించారు. లింగ్ చేసిన ఆరోపణలకు విదేశాంగ శాఖ ప్రతిని సిబి జార్జ్ స్పందించారు. భారతీయ ప్రజాస్వామ్యాన్ని, మీడియాను ఆమె సమర్ధించారు. అయితే ఏమీతెలియని ఎన్జీవోలు ఇచ్చే నివేదికలను విదేశీ విమర్శకులు పరిశీలిస్తుంటారని జార్జ్ అన్నారు. విదేశాంగ శాఖ, జర్నలిస్టు మధ్య జరిగిన సంభాషణకు చెందిన వీడియోలు వైరల్ అయ్యాయి.
జర్నలిస్టులకు ప్రశ్నలు అడిగే స్వేచ్ఛ ఉన్నట్లు కొందరు అన్నారు. అయితే డిప్లమాటిక్ బ్రీఫింగ్స్ సమయంలో ఫిక్స్డ్ ప్రోటోకాల్ ఉంటుందని, ఆ సమయంలో ఓపెన్ ఎండ్ ప్రశ్నలు ఉండవని కొందరు అన్నారు. ఈ వివాదంలో విదేశీ గూఢాచారిగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని లింగ్ అన్నారు.
Primeminister of India, Narendra Modi, would not take my question, I was not expecting him to.
Norway has the number one spot on the World Press Freedom Index, India is at 157th, competing with Palestine, Emirates & Cuba.
It is our job to question the powers we cooperate… pic.twitter.com/vZHYZnAvev
— Helle Lyng (@HelleLyngSvends) May 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

