సిటీబ్యూరో, ఆగస్ట 23 ( నమస్తే తెలంగాణ ) : రాష్ట్రీయ బాల పురస్కార్(Rashtriya Bala Puraskar )అవార్డు కోసం దరఖాస్తులను(Applications) ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమ అధికారి ఇ. అక్కేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన బాలబాలికలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 అవార్డు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు. 5 ఏండ్ల నుంచి 18 ఏండ్ల లోపు బాల బాలికలు అర్హులని వివరించారు. ధైర్య సాహసాలు, సోషల్ సర్వీస్, క్రీడలు, సర్యావరణం, సాంస్కృతిక కళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సేవా రంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలని చెప్పారు. ఆన్లైన్ నేషనల్ అవార్డ్ పోర్టల్ awerds.gov.in లో ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.