RS Praveen kumar | పోక్సో కేసులో తెలంగాణ సీఎం , హోం మంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తాను అబద్దాలకు చిరునామా అంటూ ప్రజలకు పచ్చి అబద్దాలు చెప్పడం జరిగిందన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గత 15 రోజులుగా కొనసాగుతున్న ఈ పోక్సో కేసు నిందితుడిని కాపాడేందుకు ముఖ్యమంత్రి పడుతున్న తంటాలన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నరని అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోక్సో కేసు వ్యవహారంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌ను కాపాడేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ రోజు ఆ అమ్మాయికి అంతో కొంతో న్యాయం జరిగిందంటే.. ముఖ్యంగా మొదటి నిందితుడు జైలుకు పోయిండంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ గళమెత్తడం వల్లే అని రాష్ట్ర సమాజానికే కాదు.. దేశమంతటికి అర్థమైందన్నారు.
బీఆర్ఎస్ చేయకపోతే ఇప్పటికే బండి సాయి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో దర్జాగా లొంగిపోయి స్టేషన్ బెయిల్ తీసుకుని బయట తిరిగేవాడు. ఇది వాస్తవం. కానీ ఐదు రోజుల కిత్రం ముఖ్యమంత్రి ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ పూర్తిగా అబద్దాలు చెప్పారు. దాని మీద నేను ఈ భవన్‌లోనే అవన్నీ పచ్చి అబద్దాలు, పచ్చి అసత్యాలు అని ఆధారాలతో సాక్షిగా నిరూపించాను. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంట క్రితమే మరోసారి మీడియా వేదికగా తెలంగాణ ప్రజలకు అన్నీ అబద్దాలు చెప్పారు. అవి ఎంతవరకు అబద్దాలు, ఎంత ఘోరమైన అబద్దాలు, నిరాధారమైన ఆరోపణలు అని సాక్ష్యాధారాలతో నిరూపించానన్నారు.
బండి భగీరథ్ లొంగిపోయాడని బండి సంజయ్ అబద్ధాలు చెప్తే మీరు ఎలా నమ్ముతారు
మా పోలీసులు అరెస్ట్ చేశామని చెప్పారు, నేను అదే నమ్ముతాను
– రేవంత్ రెడ్డి https://t.co/xnPOtgUHKi pic.twitter.com/cpOGIsNBkX
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2026