Bandi Sanjay | నేను మొన్న హైదరాబాద్‌లో పాలు తాగి బెడ్‌మీద పడుకున్నా. నాకు 20 సంవత్సరాలుగా జ్వరం లేదు అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన రైతు సమ్మేళనం కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. నాకు నరేంద్రమోదీ స్ఫూర్తి.. నాక్కూడా జ్వరం రాదు.. అమ్మవారి భక్తుడిని అని చెప్పి నిశ్చింతగా తిరిగినా. మొత్తానికి మొన్న హైదరాబాద్‌లో బయటకు వెళ్లి తెచ్చిన పాలు తాగిన. 3 రోజులు బెడ్‌మీద పడ్డా. 20 సంవత్సరాల్లో నాకు దగ్గు లేదు.. దమ్ము లేదు.. బీపీ లేదు.. షుగర్ లేదు.. ఏమీ లేదు.. ఇవాళ మరి తప్పెవరిది నాదే.. అంటూ చెప్పుకొచ్చారు బండి సంజయ్. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవల తన కుమారుడు బండి సాయి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.
నాకు మోడీ స్ఫూర్తి.. 20 ఏళ్ల నుండి ఎప్పుడూ జ్వరం రాలేదు
మొన్న హైదరాబాద్‌లో పాలు తాగిన.. జ్వరం వచ్చి మూడు రోజులు బెడ్ మీద పడ్డ – కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ pic.twitter.com/kGE0GbGrcn
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2026
Bharathiraja | ఇండియన్ సినిమా గమనాన్ని మార్చిన దిగ్గజం.. భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
Sachin Pilot | మళ్లీ తెరపైకి రాజస్థాన్ కాంగ్రెస్ విభేదాలు.. గెహ్లాట్ వ్యాఖ్యలకు పైలట్ కౌంటర్
Peddi Collections | మొదటి వారంలోనే రూ.345 కోట్లు.. రూ. 400 కోట్ల దిశగా రామ్ చరణ్ ‘పెద్ది’