Sachin Pilot | మళ్లీ తెరపైకి రాజస్థాన్ కాంగ్రెస్ విభేదాలు.. గెహ్లాట్ వ్యాఖ్యలకు పైలట్ కౌంటర్
Sachin Pilot | రాజస్థాన్ కాంగ్రెస్ (Rajasthan Congress) లో సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తనపై వస్తున్న విమర్శలకు సచిన్ పైలట్ పరోక్షంగా పదునైన రీతిలో స్పందించారు. నిజాయతీ, వ్యక్తిగత వైరం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Sachin Pilot : రాజస్థాన్ కాంగ్రెస్ (Rajasthan Congress) లో సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తనపై వస్తున్న విమర్శలకు సచిన్ పైలట్ పరోక్షంగా పదునైన రీతిలో స్పందించారు. నిజాయతీ, వ్యక్తిగత వైరం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గత విభేదాలను ఉటంకిస్తూ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పైలట్ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది.
కరౌలీ జిల్లాలోని సకర్ఘటా గ్రామంలో బుధవారం తన తండ్రి రాజేష్ పైలట్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సచిన్ పైలట్ ప్రసంగించారు. ‘ఎవరైనా కళ్లలోకి నేరుగా చూస్తే వారు నిజం చెబుతున్నారో లేదో తెలిసిపోతుంది. నేను కలిసి పనిచేసిన నాయకులను ఎప్పుడూ గౌరవించాను. అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కానీ వ్యక్తిగత శత్రుత్వం ఎప్పుడూ లేదు’ అని ఆయన స్పష్టంచేశారు. రాజకీయాల్లో పదవుల కంటే ప్రజాసేవకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని.. సత్యం, ప్రజా ప్రయోజనాల పక్షాన నిలిచిన వారే అంతిమ విజేతలుగా నిలుస్తారని పేర్కొన్నారు.
జూన్ 7న గెహ్లాట్ మాట్లాడుతూ.. 2022 సెప్టెంబర్ 25న జరిగిన ఎమ్మెల్యేల సమావేశం అధిష్ఠానంపై తిరుగుబాటు కాదని, పైలట్‌ను ముఖ్యమంత్రిని చేయడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఘటన అని పేర్కొన్నారు. గతంలో పైలట్‌ను కేంద్ర మంత్రిని చేయడంలో తాను పోషించిన పాత్రను ఆయన ఎప్పుడూ ప్రస్తావించకపోవడం వ్యక్తిగతంగా తనను కలచివేసిందని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకే పైలట్ తాజాగా తనదైన శైలిలో సమాధానమిచ్చినట్లు కనిపిస్తోంది.
ఈ కార్యక్రమంలో పైలట్ ప్రధాన అనుచరుడు, మాజీ మంత్రి రమేశ్ మీనా.. అశోక్ గెహ్లాట్‌పై నేరుగా విమర్శలు గుప్పిస్తూ, 2020 నాటి రాజకీయ సంక్షోభంపై నార్కో టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలపై పైలట్ మాత్రం స్పందించలేదు. ఈ తాజా పరిణామాలు రాజస్థాన్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇంకా సద్దుమణగలేదని తేటతెల్లం చేస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

