TGPSC | ఎంత ప్రయత్నం చేసినా అందరికీ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. నోటిఫికేషన్ల గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా జాబ్ ఎలాంటిదంటే..? ఎవరు కూడా కావాలని కోరుకోని పరిస్థితిలో మేముంటాం. టీజీపీఎస్సీ నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అసిస్టెంట్ సైంటిస్ట్‌కు నోటిఫికేషన్ ఇచ్చాం. దాదాపు 19 వేల దరఖాస్తులు వచ్చాయి. ఉన్న పోస్టులు మాత్రం 20. అంటే నేను ఏం చేసినా కూడా 0.1 శాతం నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలను. అంటే 99.9%మందికి నేను ఉద్యోగం ఇవ్వలేను. వారికి ఉద్యోగం ఇవ్వకపోతే వాళ్లు మన గురించి మంచి మాట్లాడుతరని చెప్పుకోవడం కష్టమన్నారు.
అసంతృప్తి అనేది సహజంగానే ఉంటుంది. అది అవసరమైందా..అనవసరమైందా..? మీడియా కూడా గమనించాలి. అకారణంగా మాట్లాడేవాళ్లను కంట్రోల్ చేసే ప్రయత్నం మీడియా కానీ సమాజం కానీ చేయాలి. ఎందుకంటే అందరికీ ఉద్యోగం ఇవ్వడమనేది ఈ నోటిఫికేషన్ అయినా.. ఏ నోటిఫికేషన్ అయినా సాధ్యం కాదు. ఉన్న పోస్టులు 20 కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి 20మందికే ఉద్యోగాలు ఇవ్వాలి. కొన్ని అపోహలు, అసత్యాలు కానీ బయట ప్రచారం చేసేవాళ్లుంటారు. దాన్ని సమాజం కానీ, మీడియా కానీ సీరియస్‌గా తీసుకోకూడదు.. ఎవరేం చెప్పినా అదే నిజమని నమ్మితే.. మన పిల్లలకు మనమే అన్యాయం చేస్తున్నమన్నారు.
జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. రెండు లక్షల ఉద్యోగాలిస్తామని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీజీపీఎస్సీ చైర్మన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
కేవలం 0.1% నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తాము.. 99.9% నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేము
ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే 19,000 మంది దరఖాస్తు చేసుకున్నారు
అలాంటప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం సహజం
ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడే… pic.twitter.com/Fq5G2Pj6fe
— Telugu Scribe (@TeluguScribe) June 1, 2026