హైదరాబాద్ : బాగ్ అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంటను(Bathukamma Kunta) హైడ్రా కమీషనర్ ఎ.వి. రంగనాథ్(Ranganath) బుధవారం సందర్శించారు. చెరువు ఆక్రమణపై స్థానికులతో మాట్లాడారు. తమ ఇళ్లు కూల్చేస్తారా అంటూ స్థానికులు కమిషనర్‌ను ప్రశ్నించగా ఇళ్లు, నివాస స్థలాల జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. అలాగే బతుకమ్మకుంటను రెండునెలల్లో పునరుద్దరిస్తామని పేర్కొన్నారు.
ఇప్పుడున్న ఐదు ఎకరాల స్థలంలోనే పునరుద్దరణ పనులు చేపడుతామని స్థానికుల ఇండ్ల జోలికి వెళ్లమని ఆయన తెలిపారు. కాగా, గతంలోనే బతుకమ్మ కుంట కబ్జాకు గురైందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా భారీగా పోలీసుల మోహరించారు.
ఇవి కూడా చదవండి