Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి వాన దంచికొట్టింది. గచ్చిబౌలిలో అత్యధికంగా 97 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది తెలిపారు.
ఈ భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక శేరిలింగంపల్లిలో 86 మి.మీ., లింగంపల్లిలో 85.8 మి.మీ., కూకట్పల్లిలో 85 మి.మీ., ఎల్బీనగర్లో 62 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. సోమవారం కూడా నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ప్రకటించారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఇవాళ అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేశారు. వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి..
Khammam Floods | ఖమ్మం జన జీవనంపై జలఖడ్గం.. ఫోటోలు
SCR | 432 రైళ్లు రద్దు.. 140 రైళ్ల దారి మళ్లింపు..
CM Revanth Reddy | వరద సాయం రూ. 5 లక్షలకు పెంపు : సీఎం రేవంత్ రెడ్డి