హైదరాబాద్: తెలంగాణ, ఏపీలో వానలు, వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది. దీంతోపాటు 140 రైళ్లు దారి మళ్లించగా, మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది. రద్దయినవాటిలో సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, సోమవారం ఉదయం 96 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.
Bulletin No.22,23.24 & 25 – SCR PR No.347 – Cancellations/Partial Cancellations/Diversions pic.twitter.com/SBLjJg8kIT
— South Central Railway (@SCRailwayIndia) September 2, 2024
Bulletin No.26: SCR PR No.348, Dt.02.09.2024 on “Diversion of Trains due to Heavy Rains” pic.twitter.com/hJAc2xGySI
— South Central Railway (@SCRailwayIndia) September 2, 2024
భారీ వరదల కారణంగా మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గం మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఎగువు, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. దీంతో రైల్వే ట్రాకులు పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. దీంతో రైళ్ల రాకపోకలు యధావిధిగా కొనసాగించేందుకు రైల్వే అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. సుమారు 300 మంది కార్మికులు రెండు భారీ క్రేన్ల సహాయంతో పనులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 60 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. వాతావరణం అనుకూలిస్తే సాయంత్రానికి పనులు పూర్తిచేసి మంగళవారం నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు.
Speedy restoration works in progress in the affected section due to incessant rains in Intakanne – Kesamudram Section, Secunderabad Division, Telangana. SCR Officials monitoring the restoration works camping at the affected site. pic.twitter.com/eok1XaHHgk
— South Central Railway (@SCRailwayIndia) September 1, 2024