Uppal | హైదరాబాద్ : ఉప్పల్‌లో ఉన్నట్టుండి రోడ్డు కుంగిపోయింది. దీంతో ఓ కారు ఆ గుంతలో దిగబడింది. మిగతా వాహనదారులు అప్రమత్తమై తమ వాహనాలను ఆపేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్ – వరంగల్ హైవేపై నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల వద్ద రోడ్డు కుంగినట్లు పోలీసులు తెలిపారు. భారీ వర్షం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తేల్చారు. రోడ్డు కుంగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇక ఆ గుంతను పూడ్చేందుకు పోలీసులు, అధికారులు చర్యలు చేపట్టారు.
ఇక కారులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం కారు ముందు టైర్లు మాత్రమే గుంతలో దిగబడ్డాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఉప్పల్‌లో నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల వద్ద కుంగిన రోడ్డు.
ఉప్పల్‌లోని హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి పై నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల వద్ద వర్షానికి రోడ్డు కుంగి భారీ గుంతలు ఏర్పడ్డాయి
కారు రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోవడంతో… pic.twitter.com/DFODNZKMBb
— Telugu Scribe (@TeluguScribe) July 16, 2024
ఇవి కూడా చదవండి..
Rain Alert | హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం
Jampanna vagu | ములుగు జిల్లాలో ఉప్పొంగి ప్రవహిస్తున్న జంపన్న వాగు
KTR | సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయండి: కేటీఆర్
Rythu Runa Mafi | ఉద్యోగులకు రుణమాఫీ లేనట్టే.. ప్రభుత్వ మార్గదర్శకాలతో 7 లక్షల కుటుంబాలకు నష్టం
Rythu Runa Mafi | సందేహాలెన్నో.. స్పష్టతే లేదు.. రుణమాఫీ మార్గదర్శకాలతో గందరగోళం