Bandi Sai Bageerath | హైదరాబాద్ : బాలికపై లైంగిక దాడి, ఇతర నేరారోపణల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. బండి సాయి భగీరథ్ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టిన పేట్ బషీరాబాద్ పోలీసులు మంగళవారం కరీంనగర్‌కు వెళ్లి, విచారణ నిమ్తితం భగీరథ్‌ను వెంట తీసుకొని బుధవారం మధ్యాహ్నం 2గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని అతడి మేనమామ వంశీకృష్ణకు నోటీసులు కూడా అందజేశారు.
అయితే బుధవారం మధ్యాహ్నం విచారణకు పోలీసులు సిద్ధంగా ఉన్నా నిందితుడు మాత్రం హాజరుకాకుండా డుమ్మాకొట్టాడు. పైగా వ్యక్తిగత కారణాలతో తాను ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోతున్నానని, పూర్తి ఆధారాలతో ఈ నెల 15న హాజరై పోలీసులకు సహకరిస్తానని, రెండు రోజుల గడువు ఇవ్వాలంటూ పోలీసులకు పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నాడు.
ఈ క్రమంలో నిందితుడు బండి సాయి భగీరథ్ తరపు న్యాయవాది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు విచారణ వారం రోజులు వాయిదా వేసింది. బండి సాయి భగీరథ్ ఇంటరిమ్ ప్రొటెక్షన్ (మధ్యంతర రక్షణ)పై విచారణను వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది.
Rashmika | ‘మైసా’ కోసం రష్మిక కష్టాలు .. కాళ్లకు టేప్ వేసుకొని మరి..!
CM Vijay | త్వరలో మహిళలకు నెలకు రూ.1,000.. వెల్లడించిన తమిళనాడు సీఎం విజయ్