హైదరాబాద్ : హైదరాబాద్(Hyderabad) నగరాన్ని వర్షాలు(Heavy rain) ముంచెత్తుతున్నాయి. బాచుపల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్,మోతీనగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అమీర్‌పేట, ట్యాంక్‌బండ్, నారాయణగూడ, కవాడిగూడ, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై పలుచోట్ల వర్షం నీరు నిలిచింది. పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
కాగా, గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాబోయే 48 గంటల్లో రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ(GHMC) కోరింది. అందరూ అప్రమత్తంగా ఉంటూ.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
హైదరాబాద్ నగరంలో నిన్న వాన దంచికొట్టిన విషయం తెలిసిందే. సరూర్‌నగర్, రాక్ టౌన్ కాలనీ, నాగోల్‌లో అత్యధికంగా 86 మి.మీ., బండ్లగూడలో 75.5 మి.మీ., హబ్సిగూడలో 70.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. రామాంతపూర్‌లో 51 మి.మీ., హయత్‌నగర్‌లో 50.55 మి.మీ., ఉస్మానియా యూనివర్సిటీలో 42.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Wine Shops | శుక్ర, శనివారాలలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం దుకాణాలు ఓపెన్
Hyderabad | హైదరాబాద్ జంట జలాశయాలకు పోటెత్తిన వరద.. ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తివేత
KTR | సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలనకు ధన్యవాదాలు.. కేటీఆర్ ఎద్దేవా