RS Praveen kumar | అడ్లూరి లక్ష్మణ్ ప్రతిసారీ హరీశ్ రావు దళిత బిడ్డలను అవమానిస్తున్నాడు అంటున్నారు. మేం ఆ వర్గాల గురించే మాట్లాడుతున్నం. హరీశ్ రావు ఏమన్నరో విన్నవా.. ఆ దళిత బిడ్డలకే కాంట్రాక్టులు ఎందుకిస్తలేవరని అన్నరు. ఆయన కూడా దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుందనే మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలోఆయన మాట్లాడుతూ.. . ఒక దళిత బిడ్డ చెప్పుల కంపెనీకి గురుకులాల్లో టెండర్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు, దాని గురించి హరీష్ రావు మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు.
కొ్ప్పుల ఈశ్వర్ అన్నట్టుగా లెదర్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ టెండర్లు మాదిగలు, చర్మకారుల నుంచి వచ్చిన కుటుంబాలకు ఇవ్వాలి. సోషల్ వెల్పేర్‌లో చదువుకున్న ఓ పిల్లవాడు మహేశ్ గోగర్ల మన షూస్ అని చిన్న చెప్పులు, బూట్ల కంపెనీ పెట్టుకున్నడు. ఆయన టెండర్లు ఇవ్వండి అని లక్ష్మన్ కుమార్ దగ్గరికి పోతడు. పోతే ఇండస్ట్రీస్ మినిస్టర్ అని మీరు సంతకం చేస్తరు. ఆ తర్వాత సెక్రటరీలకు సెక్రటరీ అయిన సవ్యసాచి ఘోష్ గారు అతన్ని చూడ కూడా చూడలేదు పాపం. ఊళ్లళ్లో ఎట్లయితే మాల, మాదిగ వాళ్లను వెలేసిర్రో అట్లనే మీ సెక్రటరీలు కూడా వాళ్లను వెలేస్తున్నారని అన్నారు.
గన్ పార్క్ దగ్గరికి బయలుదేరిన హరీష్ రావును, కేటీఆర్‌ను, మమ్మల్ని పోలీసులతో అరెస్ట్ చేయించింది రేవంత్ రెడ్డి, ఈ మంత్రులు కాదా..? అని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వెళ్తే హరీష్ రావు, కేటీఆర్ అన్ని ఆధారాలతో వస్తారని గన్ పార్క్ దగ్గరికి చర్చ స్థలం మార్చి, ఈ విషయాన్ని రేవంత్ రెడ్డికి చెప్పి వచ్చిన మాట వాస్తవం కాదా..? ఈ మంత్రులు CLP కార్యాలయం నుండి గన్ పార్క్ వద్దకు ఇంటెలిజెన్స్ పోలీసులతో వచ్చిన మాట నిజం కాదా.. ? చెప్పాలన్నారు. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు నాతో కలిసి పని చేసిన వాళ్ళే.. ఎవరి చెవిలో పూలు పెడుతున్నారని పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌ను అడిగారు.
అడ్లూరి లక్ష్మణ్ ప్రతిసారీ హరీష్ రావు దళిత బిడ్డలను అవమానిస్తున్నాడు అంటున్నాడు
హరీశ్ రావు కూడా దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుందనే మాట్లాడుతున్నాడు
ఒక దళిత బిడ్డ చెప్పుల కంపెనీకి గురుకులాల్లో టెండర్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు, దాని గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు
– బీఆర్ఎస్… pic.twitter.com/vzairej5E0
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2026
CM Rekha Gupta: వర్క్ ఫ్రం హోమ్ ఎత్తివేస్తూ ఢిల్లీ సీఎం ఆదేశాలు
KTR | రేపు కన్నేపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించనున్న కేటీఆర్
కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి..