Minister Ponnam Prabhakar | ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ విషయమై మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్‌పై నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చునన్నారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది.
ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి, నేను ప్రభుత్వం దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతీ రోజు అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. ఈ బస్సు ప్రయాణం పేదవాళ్లకి.. లైఫ్ లైన్ ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉంది.
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తాం. ఎలాంటి భేషజాలకు పోకుండా అధికారుల కమిటీకి మీ సమస్యలు విన్నవించండి..ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Hot Adilabad | ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్
Jailer 2 | ఎట్టకేలకి జైలర్ 2 షూటింగ్ పూర్తి.. రజనీకాంత్ అభిమానుల్లో పెరిగిన అంచనాలు
Earthquake | ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు