MLA Vivekananda | నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకాంద్ అన్నారు.
తెలంగాణ భవన్లో కేపీ వివేకాంద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడంలో రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలం అయ్యాడు. స్వయంగా ముఖ్యమంత్రి రోడ్లపైకి వస్తానని అంటున్నాడు. ప్రజలకు ఏం అవసరమో గుర్తించడంలో ముఖ్యమంత్రి రెండేళ్ల రెండు నెలల పాలనలో ఘోరంగా విఫలం అయ్యాడు.తనే రాజు తనే మంత్రి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి , ప్రజల అవసరాలు తీర్చడంలో రాజుగా, మంత్రిగా ఫెయిల్ అయ్యాడు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక్కపని చెయ్యలేదు.
హైడ్రా అంటే ఓ డ్రామాగా మారింది..
హంగు ఆర్భాటాలు తప్ప నగరానికి చేసింది ఏం లేదు. సెకండ్ ఫేస్ మెట్రో విస్తరణలో భాగంగా ఒక్క అడుగు ముందుకు పడడం లేదన్నారు.కేసీఆర్ హయాంలో ఆమోదించిన మెట్రో విస్తరణ ప్రాజెక్టును రద్దు చేసి నగర ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు.ఆనాడు కేసీఆర్ హయాంలో నగరానికి మెట్రో తెచ్చాము. నార్త్ హైదరాబాద్‌కు మెట్రో డిమాండ్ ఉంది, దానిపై ముఖ్యమంత్రి ఎటువంటి చర్చ చేయడం లేదు.
మూసీ సుందరీకరణ పేరుతో హడావుడి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏం మాట్లాడడం లేదు. హైదరాబాద్‌పై అవగాహన ఉన్న మంత్రి కేబినెట్లో లేరన్నారు. హైడ్రా పేరుతో హడావుడి చేసిన ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఘోరంగా విఫలం అయ్యాడు. పార్కులకు ఫెన్సింగ్ వేసి అదే గొప్ప అని హైడ్రా ప్రచారం చేసుకుంటోంది. హైడ్రా అంటే ఓ డ్రామాగా మారింది. ఎన్నికలప్పుడే సీఎం చీరలు పంచుతున్నాడు . ఇపుడు ఎన్నికల కోసమే హైదరాబాద్ అభివృద్ధి గురించి రివ్యూలు చేస్తున్నారు.
వీధి దీపాలు పెట్టనోడు, విజన్ 2047 గురించి మాట్లాడుతున్నాడు.రేవంత్‌కు దావోస్ పర్యటనల మీద ఉన్న శ్రద్ధ దోమల నిర్మూలనలో లేదుSrdp పనుల పై రేవంత్ కు అవగాహన లేదన్నారు.కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా లింక్ రోడ్లు ,ఆర్ఓబీలు, స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్ లు నిర్మించి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించారు .జీహెచ్ఎంపీ విస్తరణ అనేది పచ్చి మోసం, పూర్తిగా అశాస్త్రీయ పద్దతిలో నగరాన్ని మూడు ముక్కలు చేశారు.కార్పొరేషన్ మూడు భాగాలు చేసినప్పుడు మెట్రో వాటర్ బోర్డు ఎన్ని భాగాలు చెయ్యాలో చెప్పాలి. ప్రజల అవసరాల కంటే, ఆదాయంపైనే మక్కువ చూపిస్తున్నారన్నారు.
మళ్ళీ ఎన్నికలు ఉంటేనే పని చేసేలా..
జీహెచ్ఎంపీ పాలకవర్గ సభ్యుల పదవి కాలం ముగిసింది, మళ్ళీ ఎన్నికలు ఉంటేనే పని చేసేలా ఉన్నారు. ఎన్నికలు లేనప్పుడు ప్రజల అవసరాల గురించి పట్టించుకోవడం లేదు. రాజకీయ అవసరాల కోసమే రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడు. హైదరాబాద్ స్థాయిని పెంచిన ఘనత కేటీఆర్‌ది. ఈ రోజు నగర ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింటుంది. పన్నులు వసూల్ చేసే శ్రద్ధ, ప్రజల అవసరాలు తీర్చడంలో లేదు. ఈ సీఎంకు పన్నుల మీద ఉన్న శ్రద్ధ పనులపై లేదన్నారు. అధికారం ఉన్నదని మున్సిపల్ ఎన్నికల్లో అరాచకం చేశారు. క్యాతనపల్లి లో మాకు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ బాల్క సుమన్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ ఇంటి చుట్టూ అంత మంది పోలీసులా.. ? ప్రజా పాలన అంటే ఇదేనా.. ? GHMC ఎన్నికలు ఎప్పుడు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు.
కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లనే చూపించి..
గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మాకు మంచి ఓటు శాతం వచ్చింది. ఇందిరమ్మ ఇళ్లు అనేది పచ్చిమోసం, అబద్దం.నేను చాలెంజ్ చేస్తున్న హైదరాబాద్ లో ఒక్క ఇల్లు అయిన నిర్మించారా..? పొంగులేటి చూపించాలి. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లనే చూపించి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మోసం చేస్తున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక్క ఇల్లు అయినా కట్టాడా చూపించాలి. రెండేళ్ల నుంచి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ గుణపాఠం తప్పదు.
రేవంత్ రెడ్డికి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం మీదున్న శ్రద్ధ, ప్రజల అవసరాలు తీర్చడంలో లేదు.
సరిగ్గా ఎన్నికలప్పుడే గ్రామాల్లో చీరలు పంచుతాడు. అలాగే ఇప్పుడు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే హైదరాబాద్ అభివృద్ధి గురించి రివ్యూలు చేస్తున్నట్లు డ్రామాలు చేస్తున్నాడు.
– ఎమ్మెల్యే… pic.twitter.com/Z8kcve6jeX
— BRS Party (@BRSparty) February 18, 2026