Gajjela Nagesh | బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటును 1947లో జరిగిన భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చడం అజ్ఞానం మాత్రమే కాదు. అది తీవ్రంగా అవమానకరం, సిగ్గుచేటని తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేశ్ అన్నారు. తెలంగాణ ద్వేషం లేదా విభజనతో పుట్టలేదు. అది దశాబ్దాలపాటు సాగిన తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగాలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవం ఫలితంగా ఏర్పడిందన్నారు.
తెలంగాణ కోసం ప్రజలు ప్రాణాలు అర్పించారు, కుటుంబాలు త్యాగాలు చేశాయి, యువత భవిష్యత్తును పణంగా పెట్టింది. ఈ పోరాటానికి నాయకత్వం వహించిన కేసీఆర్ నిరంతరం పోరాడి, తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యమం ప్రజలదే. ఇది గౌరవానికి, స్వాభిమానానికి జరిగిన పోరాటం. ఇలాంటి నిర్లక్ష్యమైన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపడమే కాకుండా, తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరి త్యాగాలను అవమానిస్తున్నాయి.
ఇంకా మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే, పార్లమెంట్లో తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఈ విషయంలో మౌనం వహించడం. తమ రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన వారు స్పందించకపోవడం అత్యంత నిరాశాజనకం. బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు అనుచితమే కాదు. అవి తెలంగాణ గౌరవం, అస్థిత్వంపై నేరుగా చేసిన దాడి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే , నిస్సందేహంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Hyderabad | దారుణం.. జ్యూస్ అని చెప్పి నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Karepalli | రోడ్డు ప్రమాద నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
Loksabha: ఆ బిల్లులపై చర్చకు 251 మంది అనుకూలం.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్