అంబర్పేట, ఫిబ్రవరి 23 : నల్లకుంట డివిజన్ బీఆర్ఎస్(BRS) సీనియర్ నాయకుడు కె.శ్యామ్(గోల్నాక శ్యామ్)(59) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. అతని తల్లి, సోదరుడు యాదగిరి తదితరులు కుంభమేళాకు వెళ్లడంతో శనివారం జరగాల్సిన అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Venkatesh) అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. చాలా మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
మంచి చురుకైన కార్యకర్తను పార్టీ కోల్పోయిందని ఎమ్యెల్యే అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. కాగా, కాచిగూడలోని హర్రాస్పెంట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.
ఇవి కూడా చదవండి..
Wine Shops | తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్.. ఎందుకో తెలుసా..?
Noodles | నూడుల్స్ ను అధికంగా తింటున్నారా..? ఈ విషయాలు తెలిస్తే ఇకపై వాటిని ముట్టుకోరు..!