హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. తాజాగా మాదాపూర్ (Madapur) ఐటీసీ కోహినూర్ ఎదురుగా ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్, యూనియన్ సభ్యులు(Foot Path Food Workers) ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గతంలో సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ విషయంలో అక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నిటికి పర్మిషన్ ఇచ్చారు. కానీ, ఇప్పుడు అక్కడ ఉన్న కొన్ని సంస్థలు జీహెచ్ఎంసీ సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఉన్న పలంగా మా జీవనాధారాన్ని తొలగిస్తే ఎలా బతుకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సీఎం రేవంత్ కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.