Kashyap Patel: సీఐఏ చీఫ్‌గా ఇండియన్‌కు ఛాన్స్.. ఎవరీ కశ్యప్ పటేల్?
Kashyap Patel: సీఐఏ చీఫ్‌గా కశ్యప్ పటేల్(Kashyap Patel)కు అవకాశం దక్కనున్నది. అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారతీయ సంతతికి వ్యక్తికి ఆ కీలక పదవిని అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
న్యూయార్క్: సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్‌గా కశ్యప్ పటేల్(Kashyap Patel)కు అవకాశం దక్కనున్నది. అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారతీయ సంతతికి వ్యక్తికి ఆ కీలక పదవిని అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ కోసం ఏపని అయినా చేసేందుకు కశ్యప్ సిద్దంగా ఉన్నారు. అయితే కశ్యప్ పటేల్‌కు గుజరాతీ మూలాలు ఉన్నాయి. ఈస్ట్ ఆఫ్రికాలో ఆయన పేరెంట్స్ పెరిగారు. 1970 దశకంలో ఆయన తండ్రి ఉగాండా నుంచి వలస వచ్చారు.
1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో ఆయన జన్మించారు. హిందువుగా ఆయన పెరిగారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. రిచ్మండ్ యూనివర్సిటీలో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూయార్క్‌లో లా డిగ్రీ చదివారు. యూకేలోని యూనివర్సిటీ కాలేజీ లండన్ ఫాకల్టీ ఆఫ్ లాస్ నుంచి ఇంటర్నేషనల్ లా సర్టిఫికేట్ పొందారు. రక్షణశాఖ మాజీ కార్యదర్శి క్రిస్టోఫర్ మిల్లర్ వద్ద పనిచేశారు. నేషనల్ సెక్యూర్టీ కౌన్సిల్లో కౌంటర్ టెర్రరిజం సీనియర్ డైరెక్టర్‌గా చేశారు.
గతంలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సమయంలో.. ఐసిస్, ఆల్‌ఖయిదా కీలక నేతల హత్యలకు మిషన్ నడిపించారు. హౌజ్ కమిటీకి చెందిన ఇంటెలిజెన్స్‌కు నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్‌గా చేశారు. 2016 ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై విచారణాధికారిగా చేశారు. లాయర్‌గా అనేక కేసుల్ని వాదించారు. హత్యలు, నార్కో ట్రాఫికింగ్, ఆర్థిక నేరాల గురించి ఫెడరల్ కోర్టుల్లో వాదించారు.
2019లో ట్రంప్ టీంలో కశ్యప్ పటేల్ చేరినట్లు ఓ రిపోర్టు ద్వారా తేలింది. గత పాలన సమయంలో సీఏఐ డిప్యూటీ డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్‌ను నియమించాలని ట్రంప్ ప్లాన్ వేసినట్లు తెలిసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

