Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) కొనసాగుతోంది. రోజురోజుకూ కాలుష్యం తీవ్రమవుతోంది. గురువారం ఉదయం ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత చాలా పేలవమైన స్థాయిలో నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. ఉదయం 9 గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత 367గా నమోదైంది.
ఆనంద్ విహార్, జహంగీర్‌పురి, అశోక్ విహార్, బావన, ముంద్కల్, రోహిని, సోనియా విహార్, వివేక్ విహార్, వాజీపూర్.. ఈ తొమ్మిది ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీలో ఉందని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. మరోవైపు కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఓ వైపు వాయు కాలుష్యంతో ఊపిరితీసుకోవడం ఇబ్బందికరంగా మారగా.. మరో వైపు నీటి కాలుష్యంతోనూ సతమతమవుతున్నారు. యయునా నదిలో కాలుష్య స్థాయి విపరీతంగా ఉన్నది.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. అయితే, గత కొంతకాలంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారుతోన్న విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలపెట్టడానికి తోడు.. మంచు రాజధానిని కమ్మేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కాలుష్య నియంత్రణకు పాలకులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ కారణంగా నగర వాసులు తీవ్ర అనారోగ్య సమసల్యకు గురికావాల్సి వస్తోంది.
Also Read..
US President | అమెరికా అధ్యక్షుడి జీతం.. ఇతర సౌకర్యాల గురించి తెలుసా..?
Donald Trump | ఇప్పుడు గెలిచినా.. వచ్చే ఏడాదే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం..!
PV Sindhu | విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీకి భూమి పూజ చేసిన పీవీ సింధు