Musi River | హైదరాబాద్ : మూసీకి వరద పోటెత్తింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలనుంచి జంటజలాశయాలకు వరద ఉధృతి పోటెత్తుతోంది. దీంతో అధికారులు జలాశయాల గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ రెండు జలాశయాల్లోకి 1750 క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు.
మంగళవారం జలమండలి అధికారులు ఉస్మాన్‌సాగర్ 6 గేట్లను ఎత్తివేశారు. హిమాయత్‌సాగర్ ఒక గేట్ ఎత్తారు. ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 1400 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1428 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ఉస్మాన్‌సాగర్ 6 గేట్లను రెండుఫీట్ల మేర ఎత్తారు. హిమాయత్‌సాగర్ ఒక గేటు ఒక అడుగుమేర ఎత్తి 348 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జంట జలాశయాల నుంచి 1776 క్యూసెక్కుల వరదనీటిని మూసీనదిలోకి విడుదల చేస్తున్నారు. గేట్ల ఎత్తివేత నేపథ్యంలో మూసీనదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Bathukamma | తరతరాల మహిళా సామూహిక శక్తి బతుకమ్మ : కేసీఆర్
Dasara Holidays | రేపట్నుంచి దసరా సెలవులు.. పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తప్పవు
MMTS | రేపు హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు