Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఆరాంఘర్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహీంద్రా షోరూమ్ వెనుక ప్రాంతంలో ఉన్న ఓ గోడౌన్లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీలోనూ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఎంఎం పహాడీలోని స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు అక్కడ్నుంచి పరుగులు తీశారు. 2 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | పచ్చని పంట పొలాల్లో ఫార్మా చిచ్చు పెడుతున్న రేవంత్ రెడ్డి : హరీశ్ రావు ఫైర్
Nallagonda | నార్కట్‌పల్లిలో దొంగల బీభత్సం.. వరుసగా పది ఇళ్లలో చోరీ : వీడియో