Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజరాజేశ్వరీ కాలనీ గెలాక్సీ అపార్ట్మెంట్లోని 9వ అంతస్తులో ఉన్న ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ఫ్లాట్‌లో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఏడాదిలోనే కాంగ్రెస్ కాలకేయ అవతారం.. రేవంత్ రావణాసుర రూపం బయట పడ్డాయి : హరీశ్‌రావు
Prabhas | డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. న్యూ ఇయర్ వేళ ప్రభాస్ వీడియో మెసేజ్!