Khajaguda | హైదరాబాద్ : నా వంతుగా రేవంత్ రెడ్డికి 375 ఓట్లు వేసి గెలిపించిన పాపానికి ఇవాళ నన్నే రోడ్డుమీద పడేసిండు అని ఓ వ్యక్తి కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఇవాళ ఉదయం ఖాజాగూడ భగీరథమ్మ చెరువు బఫర్జోన్లోని నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా బాధిత వ్యక్తి బోరున విలపించాడు. కేసీఆర్ అంటే నాకు గిట్టదు.. కానీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి కూల్చివేతలు ఎక్కడా జరగలేదు. మనస్సాక్షిగా చెబుతున్నా.. కూల్చివేతలు అనే మాటనే లేదు. మా కుటుంబ సభ్యులతో కొట్లాడి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి నా తరపున 375 ఓట్లు వేయించాను. అలాంటిది.. ఇవాళ నాకే అన్యాయం జరిగింది. మాది మాత్రమే కూలగొట్టారు. మేం రోడ్డు పాలయ్యాం.. మేం బతికినా.. చచ్చినా ఒక్కటే.. వేరే వాళ్లవి ఎందుకు కూలగొట్టలేదు..? వాళ్లు రూ. 20 లక్షలు ఇచ్చినందుకా..? లంచాలు తీసుకొని కొందరివి కూలగొట్టడం లేదు. మేం ప్యాలెస్లు కట్టుకోలేదు కదా..? షెడ్లు వేసుకోలేదు కదా..? ఏం కట్టుకున్నాం.. కట్టెలు ఉన్నాయి.. పైన తడకలు ఉన్నాయి. సామాన్లు మొత్తం రోడ్డుపాలు చేశారు. ఈ స్థలంలో నెలకు రూ. 12 వేలు చెల్లించి కిరాయికి ఉంటున్నాం అని బాధితుడు పేర్కొన్నాడు.
నాకు కేసీఆర్ అంటే నచ్చదని రేవంత్ రెడ్డికి 375 ఓట్లు వేసి గెలిపించిన
గెలిపించిన పాపానికి మా మీదనే పడ్డాడు
20 లక్షలు లంచాలు తీసుకొని పక్కన వాళ్ళవి కూలగొట్టకుండా వదిలేస్తున్నారు
ఖాజాగూడా చెరువులో హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడ్డ బాధితుడు pic.twitter.com/Q8q4d9Fh5P
— Telugu Scribe (@TeluguScribe) December 31, 2024
ఇవి కూడా చదవండి..
Hyderabad Metro | న్యూ ఇయర్ వేళ అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో సర్వీసులు