బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Jul 12, 2020 , 00:07:24

ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి

ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి

అందరి రక్షణకు ప్రభుత్వం చర్యలు  

జీహెచ్‌ఎంసీ సిబ్బందికి పీపీఈ కిట్ల  పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ 

అంబర్‌పేట : కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. అందరి రక్షణకు ప్రభు త్వం చర్యలు తీసుకొంటున్నదని ఆయన అన్నారు.  నిత్యం శ్రమిస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది రక్షణలో భాగంగా శనివారం గోల్నాక డివిజన్‌ నెహ్రూనగర్‌లోని వార్డు కార్యాలయంలో డివిజన్‌ కార్పొరేటర్‌ కాలేరు పద్మ, సర్కిల్‌ డీసీ వేణుగోపాల్‌, ఏఎం హెచ్‌వో డా.హేమలతతో కలిసి ఎంటమాలజీ సిబ్బందికి ఆయన పీపీఈ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా సమయంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్వహిస్తున్న పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ ఇన్‌చార్జి వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు. 

నల్లకుంటలో.... నల్లకుంట డివిజన్‌లో కార్పొరేటర్‌ గరిగంటి శ్రీదేవిరమేశ్‌ శనివారం ఎంటమాలజీ సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేశారు. 

బాగ్‌అంబర్‌పేటలో.... బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ కార్పొరేటర్‌ కె.పద్మావతి శనివారం డివిజన్‌లోని రామకృష్ణానగర్‌ పార్కులో ఎంటమాలజీ సిబ్బందికి పీపీఈ కిట్లను పంపిణీ చేశారు.  

కాచిగూడలో.. సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి పట్టుదలతో ఉన్నారని కాచిగూడ కార్పొరేటర్‌ ఎక్కాల చైతన్య అన్నారు. కరోనా నేపథ్యంలో డివిజన్‌లోని 50 మంది ఎంటమాలజీ సిబ్బందికి పీపీఈ కిట్లను  ఆమె నాయకుడు ఎక్కాల కన్నా, డీసీ వేణుగోపాల్‌, ఏఎంహెచ్‌వో హేమలతతో కలిసి  పంపిణీ చేశారు. 


logo