Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట – సైదాబాద్ రహదారిలో మంగళవారం మధ్యాహ్నం ఘోరం జరిగింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ ట్రాన్స్ఫార్మర్ ఉన్నట్టుండి పేలిపోయింది. దీంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసింది. ఈ ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఆఫీసర్స్ మెస్ ఫంక్షన్ హాల్ ఉంది. ఈ హాల్‌కు మంటలు అంటుకోకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకుంది. ఓవర్ లోడ్ కారణంగానే ట్రాన్స్ఫార్మర్ పేలిపోయినట్లు అధికారులు నిర్ధారించారు.
ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో.. ప్రధాన రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో రహదారికి ఇరువైపులా దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. మంటలను అదుపు చేసిన అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | హైదర్షాకోట్లో మహిళ దారుణ హత్య
Hyderabad | నగరంలో ఆ నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లు.. అత్యల్పం ఎక్కడంటే?