మణికొండ, జనవరి 7 : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ దారుణ హత్యకు(Brutally murdered) గురైన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షాకోట్ (Haidershakot) గ్రామం నర్సారెడ్డి కాలనీలో ఓ గుడిసెలో నివసించే మొగులమ్మ(40) అనే మహిళ కొన్నాళ్లుగా ఇళ్లల్లో కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నది.
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ గ్రామానికి చెందిన మొగులమ్మ భర్త కొన్నాళ్ల క్రితం మృతిచెందడంతో తన పదేళ్ల కుమారుడిని సొంతూరులో ఉంచి నగరంలో కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నది. కాగా, మంగళవారం తెల్లవారుజామున మొగులమ్మ గుడిసెలో విఘతజీవిగా కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
HMPV | హెచ్ఎంపీవీ కలకలం.. ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టండిలా..!
Harish Rao | మొట్టమొదటి హామీకే దిక్కు లేకుండా పోయింది..! కాంగ్రెస్ గ్యారెంటీలపై హరీష్రావు ఫైర్