Manne Krishank | రెండేళ్లలో ‘కమిషన్లు ,కాంట్రాక్టులు ,కాంగ్రెస్ పార్టీ’ పుస్తకాన్ని ప్రెస్ మీట్లో విడుదల చేసిన బీఆర్ఎస్ నేతలు మన్నె క్రిశాంక్, కె కిషోర్ గౌడ్,దినేష్ చౌదరీ , హరీష్ రెడ్డి, మన్నె క్రిశాంక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి రూ.150 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారని అన్నారు.
విజన్ డాక్యుమెంట్ ఛాట్ జీపీటీలో తయారు చేశారు. మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలంగాణ గ్రోత్ స్టేట్ అని అన్నారు.బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయిర్ కేసీఆర్ పాలనను మెచ్చుకున్నారు. ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేసింది13వేల ఎకరాలు. సేకరణ చేస్తే కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. పెట్టుబడిదారులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాంతారా జూ పార్క్ ను కాంగ్రెస్ జాతీయ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్ వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అంబానీ,అదానీపై రాహుల్ గాంధీ మాట్లాడతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అంబానీ,అదానీతో దోస్తానా చేస్తున్నారన్నారు.
తెలంగాణ రైజింగ్‌లో పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకువెళ్లిపోతున్నాయి. డి.కె.శివకుమార్ గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చి బెంగళూరును ప్రమోట్ చేశారు.నెల రోజుల క్రితం మొదలైన ఎస్ఎల్ఆర్ సురభి రూ.3 వేల కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పింది. రేవంత్ రెడ్డి తన స్వంత అన్న స్వచ్చ బయో కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీపై భూకబ్జా కేసు నమోదు అయింది.
ట్రంప్ సంస్థకు పదివంతుల ఆస్తి లేకపోయినా లక్ష కోట్ల పెట్టుబడులు పరూ.150 కోట్లు ఖర్చు. తెలంగాణ ఆర్ధికంగా ఎదిగిందని మాజీ ఆర్బీఐ గవర్నర్ స్వయంగా చెప్పారు. తెలంగాణ దివాళా తీసిందని రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
గ్లోబల్ సమ్మిట్ పేరుతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారు : బీఆర్ఎస్ నేత దినేష్ చౌదరీ
గ్లోబల్ సమిట్ తో పెట్టుబడులు వచ్చి తెలంగాణ కు మేలు జరిగితే మేమే ఎక్కువ సంతోషిస్తాం..ప్రభుత్వం చూపిన పెట్టుబడుల్లో 2 శాతం వాస్తవరూపం దాల్చినా తెలంగాణ కు మేలు జరుగుతుంది…అయితే ప్రభుత్వం ఎంఓయూ లు కుదుర్చుకున్న కంపెనీ ల్లో చాలా వరకు విశ్వసనీయత లేనివే…ప్రజల సొమ్ము దుబారా చేశారు…వారం రోజులు ,నెల రోజుల ముందు పుట్టిన కంపెనీలతో ఒప్పందాలు ఎలా కుదుర్చుకుంటున్నారు ?..పరిశ్రమల ముసుగులో ఆర్థిక అక్రమాలు చేస్తున్న కంపెనీల పై ఈడీ దర్యాప్తు చేయాలి ఇందులో షెల్ కంపెనీలు ఎన్ని ఉన్నాయో తేల్చాలి …లక్షా 74 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని గతంలో ప్రభుత్వం చెప్పుకుంది .వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరం లో వచ్చింది 9 వేల కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు.
e-cigarette: పార్లమెంట్లో ఈ-సిగరేట్ తాగిన టీఎంసీ ఎంపీ.. బీజేపీ ఆరోపణలు
Fire Accident | మంచిర్యాలలో ఇంటిపై అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
Panchayat Polling | ముగిసిన తొలి విడుత పోలింగ్.. కొద్దిసేపట్లో మొదలుకానున్న కౌంటింగ్..