RS Praveenkumar | జనవరిలో బయటపడిన కుంభకోణం గురించి ఇంకా ఎందుకు విచారణ జరగలేదు.. ? అని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్నిప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనగామ జిల్లాలో ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయాన్ని 38 మీసేవ కేంద్రాల నిర్వాహకులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంతా కలిసి ఒక సాఫ్ట్వేర్ వినియోగించి వారంతా తీసుకుని.. రైతుకు మాత్రం కేవలం 10 వేల రూపాయలు లేదా లక్ష రూపాయలని చూపించి ప్రభుత్వానికి మాత్రం కేవలం 1 రూపాయి మాత్రమే కట్టారన్నారు. అంటే రైతు దగ్గర మాత్రం లక్ష రూపాయలు కలెక్ట్ చేసుకుంటడు. ప్రభుత్వానికి మాత్రం ఆ 5 సున్నాలు తీసేసి ఒకటే రూపాయి అని చెప్పి కట్టారన్నారు.
ఆనాడు ఈ భూభారతి కుంభకోణం బయటపడ్డది. ఆనాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలా చిన్నది. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నట్టు ఇది వేల కోట్ల కుంభకోణం కాదు. కేవలం 3 కోట్ల 95 లక్షల స్కాం మాత్రమే అని జనవరి 2026లో గౌరవ మంత్రి చెప్పారన్నారు. ఆ వార్త బయటికి వచ్చి ఇప్పటికీ 7 నెలలు గడుస్తుంది. అప్పుడేమో రెవెన్యూ మంత్రి మేం పెద్ద ఎత్తున విచారణకు ఆదేశించాం. కానీ ఎలాంటి అక్రమాలు జరుగుకుండా చూస్తామన్నారు. మీరు, ముఖ్యమంత్రి ప్రజల చెవుల్లో పూలు పెట్టడంలో పీహెచ్డీ చేశారని ఇప్పటికే అందరికీ అర్థమైందన్నారు.
వేగవంతంగా విచారణ జరుపుతున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. మళ్లీ గత నెల 19, 20వ తేదీల్లో శేరిలింగంపల్లి, కాజాగూడలోని 13 మరియు 16 గుంటల భూమిని SAS INFRA సంస్థకు అక్రమంగా బదిలీ చేశారన్నారు. ఆ విషయం కనీసం స్థానిక అధికారులకు కూడా తెలియదు. లక్షల కోట్ల విలువైన డేటా మేనేజ్ చేసే NIC సంస్థకు భూ భారతి నిర్వహణ బాధ్యతలు ఇచ్చినా, వారికి కూడా ఈ అక్రమాల గురించి తెలియదు అంటున్నారు. ఈ అక్రమాల గురించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడూ రివ్యూ చేయలేదు, ఎందుకంటే ఆ అక్రమాల వెనుక ఉన్నది అతనేనన్నారు.
జనవరిలో బయటపడిన కుంభకోణం గురించి ఇంకా ఎందుకు విచారణ జరగలేదు ?
జనగామ జిల్లాలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం డైవర్ట్ చేస్తూ 38 మీసేవ కేంద్రాల నిర్వాహకులు అక్రమానికి పాల్పడ్డారు
ఆ వార్త బయటికి వచ్చి ఇప్పటికీ ఏడు నెలలు గడుస్తుంది, కానీ ఎలాంటి చర్యలు లేవు
వేగవంతంగా విచారణ… https://t.co/VjBmW0uC0p pic.twitter.com/XJNvwAdvYa
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2026