బేగంపేట్ జనవరి 29 : గుండెపోటుతో ఓ కానిస్టేబుల్ హఠాన్మరణం(Constable dies) చెందాడు. మార్కెట్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన కార్తీక్ (25) కార్తీక్ 2020 బ్యాచ్‌కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం కార్తీక్ మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో(Market police station) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే వివాహం కూడా చేసుకున్నాడు. ఈ నెల 18 పోలీస్‌స్టేషన్‌లో లీవ్ తీసుకోని స్వగ్రామానికి వెళ్లాడు.
బుధవారం ఉదయం ఇంట్లో సాధారణంగా తిరుగుతూ ఒక్కసారిగా గుండె పోటు రావడంతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు. కార్తీక్ మృతితో మార్కెట్ పోలీస్ స్టేషన్లో విశాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Suryapeta | నానమ్మ కళ్లలో ఆనందం కోసమే నా భర్త హత్య.. భార్గవి సంచలన వ్యాఖ్యలు..!