KTR | దిల్సుఖ్నగర్ లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం, ఉద్యోగాల భర్తీ కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువతపై, పోలీస్ అభ్యర్థులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి లాఠీఛార్జ్ చేయించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులను వీధుల వెంట వెంటాడి వేటాడటం, అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. విద్యార్థులను, నిరుద్యోగులను పోలీసులతో అణగదొక్కడమే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఇందిరమ్మ ప్రజా పాలననా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని అనేక రోజులుగా పలు రకాల నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే.
ఎన్నికల ముందు ఒకే ఏడాది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ‘మెగా నోటిఫికేషన్లు’, ‘జాబ్ క్యాలెండర్’ అంటూ కోతలు కోసి, నిరుద్యోగ యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నేడు నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 20 వేలకి పైగా పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ, కేవలం 5 వేల పోస్టులతో చేతులు దులుపుకోవాలని చూడటం అన్యాయమన్నారు. సుదీర్ఘకాలంగా కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నట్టుగా వెంటనే 20,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తూ మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో హక్కుల కోసం పోరాడిన నిరుద్యోగ జేఏసీ నేతలను, విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. అరెస్టయిన ప్రతి ఒక్క నిరుద్యోగ బిడ్డను బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాఠీలతో నిరుద్యోగుల గొంతు నొక్కాలని చూస్తే ఈ ప్రభుత్వానికి కాలం దగ్గరపడినట్టేనని ఆయన హెచ్చరించారు.
నిరుద్యోగుల ఆవేదనను, వారి న్యాయమైన డిమాండ్లను లాఠీలతో అణచివేయలేరని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండివైఖరి వీడి, 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, వయోపరిమితి సడలింపు వంటి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే, నిరుద్యోగ, విద్యార్థి సమాజానికి అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్తత
మరోసారి రోడ్డు పైకి వచ్చిన నిరుద్యోగులు
నిరుద్యోగుల పై పోలీసుల దాడి
డప్పు చప్పుళ్ళతో నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు
పోలీస్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
5 వేల పోస్టులు కాదు.. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని… https://t.co/UBOJQ9DAZh pic.twitter.com/7Sy3eCVUnP
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2026
దిల్‌సుఖ్‌నగర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత
రోడ్డు పైకి వచ్చి నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అక్రమ అరెస్ట్ చేస్తున్న పోలీసులు
పోలీస్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
5 వేల పోస్టులు కాదు.. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్
అక్రమంగా అరెస్ట్… https://t.co/vj0gglmKp1 pic.twitter.com/r87hkUSbId
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2026