రాహుల్‌గాంధీతో టచ్‌లో ఉన్నా: జగ్గారెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఇక్కడి విషయాలన్నీ తాను నేరుగా రాహు ల్ గాంధీకి చేరవేస్తున్నట్టు చెప్పారు.
సంగారెడ్డి, జూలై 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఇక్కడి విషయాలన్నీ తాను నేరుగా రాహు ల్ గాంధీకి చేరవేస్తున్నట్టు చెప్పారు. బుధవా రం సంగారెడ్డిలో కాంగ్రెస్ బూత్‌లెవల్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా తన మనసు లో ఓ కోరిక ఉన్నదని, దాన్ని నవంబర్‌లో బ యటపెడుతానని స్పష్టంచేశారు. రాహుల్‌కు మాట ఇవ్వటం వల్లే తాను మూడున్నరేండ్లు గా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ అంతర్గత రాజకీయాలపై ఏం మాట్లాడంలేదని పేర్కొన్నారు. మూడున్నరేండ్ల క్రితం పార్టీ అంశాలపై అప్పట్లో బహిరంగంగా, అంతర్గతంగానూ చర్చించినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాల్లో తాను లేవనెత్తిన అంశాలు బయటకు వస్తుండటంతో కొంతకాలంగా తాను పీఏసీ సమావేశాలకు హాజరుకావటం లేదని అన్నా రు. ‘మీరు పార్టీకి సంబంధించి ఏ విషయమైనా మీడియా ముందు మాట్లాడొద్దు. ఢిల్లీకి వచ్చి నేరుగా నాతో చెప్పాలి’ అని రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ తనకు సూచించారని, ఆ మేరకు ఎప్పటికప్పుడు పార్టీ వ్యవహారాలను ఆయనకు నేరుగా చేరవేస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

