Congress Leader | మహిళపై కాంగ్రెస్ నేత అత్యాచారం.. ఆపై న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్..!
Congress Leader | చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడిపై అత్యాచారం, బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఆరోపణలు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Congress Leader | కొండాపూర్, జూలై 1 : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు కంది జ్ఞానేశ్వర్‌పై అత్యాచారం, బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఆరోపణలు నమోదవడం సంచలనం రేపుతోంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాధిత మహిళతో పరిచయం పెంచుకున్న కంది జ్ఞానేశ్వర్ ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మహిళకు సంబంధించిన నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని చెబుతూ, వాటిని బయటపెడతానంటూ బెదిరించి మానసికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా వివిధ అవసరాల పేరుతో మహిళ నుంచి డబ్బులు తీసుకుని, తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు బెదిరింపులకు దిగినట్లు కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె చందానగర్ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేసి నిందితుడు కంది జ్ఞానేశ్వర్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. బాధితురాలు చేసిన ఆరోపణలపై ఆధారాలు సేకరిస్తున్నట్లు, కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా కంది జ్ఞానేశ్వర్ పేరు గతంలో కూడా వివాదాల్లో నిలిచింది. ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసు కూడా అతనిపై నమోదైంది.
Read Also :
SS Rajamouli | ఇంకా 80 రోజుల షూటింగే బాకీ.. ‘వారణాసి’పై రాజమౌళి అప్డేట్!
‘వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి’
YS Jagan | ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన..కూటమి పాలనపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

