Jagadish Reddy | కేసీఆర్ ఇచ్చిన కరెంటు, నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు : కాంగ్రెస్ మేనిఫెస్టోపై జగదీష్ రెడ్డి
Jagadish Reddy | రైతు రుణమాఫీ ,రైతు బంధు పై మోసం చేశారు.. ప్రజల ఆశలు నిరాశలు అయ్యాయి ..కలలు కల్లలు అయ్యాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు చిత్తు కాగితాల్లాగా చూస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికలకు ముందు కేసీఆర్ చేసిన వాటి కన్నా రెండింతలు ,మూడింతలు ఎక్కువ చేస్తామని చెప్పింది. .స్వర్గమే ఇక్కడికి తెస్తామన్నారు. 420 హామీలు గ్యారంటీలు డిక్లరేషన్లతో కాంగ్రెస్ జాతీయ నాయకులు ప్రజలను మభ్యపెట్టారు..రైతులను , యువతను ,బీసీ ,ఎస్సీ ,ఎస్టీలను ,మైనారిటీల ను డిక్లరేషన్లతో మోసం చేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు అఫిడవిట్లు ,బాండ్ పేపర్లు ఇచ్చి మరీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.. తులం బంగారం ఇస్తామని ఫించన్ల మొత్తం పెంచుతామని ఎన్నికల సభల్లో ఊదర గొట్టారు. ఆటో డ్రైవర్లను ,విద్యార్థులను రకరకాల హామీలతో మోసం చేశారు. కాలేజీలకు వెళ్లే విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. రైతు రుణమాఫీ ,రైతు బంధు పై మోసం చేశారు.. ప్రజల ఆశలు నిరాశలు అయ్యాయి ..కలలు కల్లలు అయ్యాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు చిత్తు కాగితాల్లాగా చూస్తున్నారు.
నవంబర్ 17ను బ్లాక్ డేగా మార్చారు..
ఇంత చెత్త పాలనను గతంలో ఎన్నడూ చూడలేదని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతు కోశారు.. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన కరెంటు ,నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారన్నారు జగదీష్ రెడ్డి . కాంగ్రెస్ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయాల్సిందే. మూడేళ్ల క్రితం ఇదే రోజు నవంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో ను విడుదల చేశారు. తెలంగాణకు నవంబర్ 17ను బ్లాక్ డే గా మార్చారు. మంత్రులు రకరకాలుగా మాట్లాడుతున్నారు..హైదరాబాద్ కు మంచి నీటి సమస్య లేదని ఒకడు పంటలు వేసుకువద్దని ఇంకొకడు మాట్లాడుతారు.. అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారింది.
భస్మాసుర హస్తంగా మారిన కాంగ్రెస్ మేనిఫెస్టోను చింపి చెత్తబుట్టలో వేస్తున్నాం. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నార
రని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. డబ్బుల సంపాదనే కాంగ్రెస్ కు ముఖ్యమైంది. కాంగ్రెస్ భూ స్థాపితం కావడం ఖాయం. సమ్మక్క సారక్క బ్యారేజ్‌కు అనుమతి కోసం సీఎం రేవంత్ ,ఉత్తమ్ ఇపుడు ఛత్తీస్ ఘడ్కు వెళ్తున్నారు.కేసీఆర్ మళ్లీ సీఎం అయివుంటే ఇప్పటికే ప్రాజెక్టులకు అనుమతి వచ్చి ఉండేది. ఉత్తమ్ కు ఒక్కడికే హైదరాబాద్‌లో నీళ్ల కొరత లేదని అనిపిస్తున్నట్టుంది. ప్రజల దగ్గరికి వెళితే తెలుస్తుంది. చంద్రబాబుకు దక్షిణగా గోదావరి కృష్ణా జలాలు తరలించారనేది నూటికి నూరు పాళ్లు నిజమన్నారు.
LIVE: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం https://t.co/TYaK1CSYVj
— BRS Party (@BRSparty) November 17, 2026
Read Also :
విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వంటమనిషి..? బాలికల గురుకుల స్కూల్లో కలకలం
Jupally Krishna Rao | కాలువల నుండి ఒక్క చుక్క నీరు ఇవ్వం.. మంత్రి జూపల్లి కృష్ణారావు
Free bus | ఫ్రీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు : వీడియో
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | కేసీఆర్ ఇచ్చిన కరెంటు, నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు : కాంగ్రెస్ మేనిఫెస్టోపై జగదీష్ రెడ్డి
‘కాంగ్రెస్ దొంగ హామీలకు నేటితో మూడేళ్లు’
Global Summit | ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ను వెంటనే వాయిదా వేయాలి.. సీఎంకు మేధావుల బహిరంగ లేఖ
Premada Oorali | రూ. 139 కోట్ల బాక్సాఫీస్ సంచలనం.. ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమద ఊరలి’!
Delhi High Court: 3 వారాల డెడ్‌లైన్.. కేజ్రీ టీమ్‌కు ఢిల్లీ హైకోర్టు వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

