Premada Oorali | రూ. 139 కోట్ల బాక్సాఫీస్ సంచలనం.. ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమద ఊరలి’!
Premada Oorali | కన్నడ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన 'ప్రేమద ఊరలి' (Premada Oorali) సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది.
Premada Oorali | కన్నడ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘ప్రేమద ఊరలి’ (Premada Oorali) సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది. కేవలం 60 షోలతో చాలా సాధారణంగా థియేటర్లలో విడుదలై, మౌత్ టాక్‌తో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం రూ. 139 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. కాగా, థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా నవంబర్ 17 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో డిజిటల్ స్ట్రీమింగ్‌ను ప్రారంభించింది. మరోవైపు తెలుగులో కూడా ఈ చిత్రం ప్రేమనే ఊరిలో అనే పేరుతో విడుదలై పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది.
మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగాయణ రఘు, శ్రీ రామ్, రామిక శివు మరియు తపస్విని పూనాచ ప్రధాన పాత్రల్లో నటించారు. భార్య మరణం తర్వాత తన కుమారుడు సంతును పెంచే ఒక సాధారణ రైతు నాగన్న (రంగాయణ రఘు) జీవితం మరియు వారి కుటుంబ బంధాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రచార ఆర్భాటం లేకుండా కేవలం 60 షోలతో మొదలైన ఈ సినిమా, కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా పుంజుకుని కర్ణాటక వ్యాప్తంగా 450కి పైగా కేంద్రాలకు విస్తరించింది. నాని నటించిన ‘ది ప్యారడైజ్’ మరియు శివరాజ్‌కుమార్ ‘బెయిల్’ వంటి భారీ చిత్రాల పోటీని తట్టుకుని నిలబడిన ఈ చిత్రం, విడుదలైన 26 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. సుమారు 53 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 139.32 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి కన్నడ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వానిల్లా ఎంటర్టైన్మెంట్స్, జనకమ్మ ప్రొడక్షన్స్ పతాకాలపై మమత దేవేంద్ర, ప్రశాంత్ డి.ఎస్, రమేశ్ ఎన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సునాద్ గౌతమ్ సంగీతం అందించగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Premada Oorali | రూ. 139 కోట్ల బాక్సాఫీస్ సంచలనం.. ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమద ఊరలి’!
Delhi High Court: 3 వారాల డెడ్‌లైన్.. కేజ్రీ టీమ్‌కు ఢిల్లీ హైకోర్టు వార్నింగ్
Suryakumar Yadav: సెలక్టర్ జహా బైట్తా హై, వహి మార్నా హై.. ఎంఎస్ ధోనీ ఫిల్మ్ ప్రేరణతో రాణిస్తున్న సూర్య
Rahul Gandhi | అమ్మ భయపడటం నా జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదు : రాహుల్‌గాంధీ
విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వంటమనిషి..? బాలికల గురుకుల స్కూల్లో కలకలం
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

