Suryakumar Yadav: సెలక్టర్ జహా బైట్తా హై, వహి మార్నా హై.. ఎంఎస్ ధోనీ ఫిల్మ్ ప్రేరణతో రాణిస్తున్న సూర్య
Suryakumar Yadav: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై కెప్టెన్ సూర్యకుమార్ దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు కొట్టాడు. తన సక్సెస్ గురించి చెబుతూ ఎంఎస్ ధోనీ ఫిల్మ్ డైలాగ్‌ను గుర్తు చేశాడు.
న్యూఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై కెప్టెన్ సూర్యకుమార్(Suryakumar Yadav) దుమ్మురేపుతున్నాడు. వరుసగా రెండు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు కొట్టాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో మళ్లీ కేక పుట్టిస్తున్నాడు. ఇటీవల టీ20 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో జట్టు నుంచి తప్పించారు. అయితే తాజా ముస్తాక్ అలీ టోర్నీతో అతను మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అతను 21 బంతుల్లో 60 రన్స్ చేశాడు, ఆ తర్వాత గుజరాత్‌పై 29 బంతుల్లో 82 పరుగులు చేశాడు. సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు సూర్య తన డాషింగ్ బ్యాటింగ్ స్టయిల్‌ను ప్రదర్శిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత సూర్య మీడియాతో మాట్లాడాడు. పరుగులు రాబట్టడం, ముంబైని గెలిపించడంపైనే ఫోకస్ పెట్టినట్లు చెప్పాడు. ఇక భారత మాజీ కెప్టెన్ ధోనీ జీవితకథ ఆధారంగా తీసిన ఎంఎస్ ధోనీ ద అన్‌టోల్డ్ స్టోరీ ఫిల్మ్‌లో ఉన్న ఓ డైలాగ్‌ను కూడా అతను గుర్తు చేశాడు. తన మైండ్‌సెట్ గురించి చెబుతూ ఆ ఫిల్మ్ డైలాగ్‌ను సూర్య వివరించాడు. ఆ సినిమాలో మహేంద్ర సింగ్ ధోనీతో అతని స్నేహితుడూ మాట్లాడుతూ.. సెలెక్టర్లు ఎక్కడ కూర్చుంటారో, అక్కడికే బంతిని కొట్టాలన్న డైలాగ్ వినిపిస్తాడు. అయితే ఆ ప్లాన్‌తోనే ఇవాళ తాను ఆడినట్లు సూర్య చమత్కరించాడు. వీలైనంత నిలకడగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు.
ఇక ఈస్ట్ జోన్ బీసీసీఐ సెలెక్టర్ శివసుందర్ దాస్ ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. హైదరాబాదీ బౌలర్లను సూర్య అటాక్ చేస్తున్న సమయంలో కొందరు ఐపీఎల్ ప్లేయర్లు కూడా ఆ మ్యాచ్‌ను తిలకించారు. సాల్ట్‌లేక్‌లో ఉన్న జాదవ్‌పూర్ వర్సిటీ గ్రౌండ్ బయట ఓ సిక్సర్ పడింది. టీ20 గేమ్ అనేది ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ అని, చాలా స్వేచ్ఛగా ఆడాలని సూర్య పేర్కొన్నాడు. సెలెక్టర్లకు మెసేజ్ ఇవ్వడం తన ఉద్దేశం కాదు అని, బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు. ప్రాక్టీస్‌లో కొట్టిన షాట్లనే.. మైదానంలో ఆడుతున్నానని, అంటే తన ప్రాక్టీస్ సక్సెస్ అయినట్లే అని సూర్య తెలిపాడు.
🚨 Suryakumar Yadav show in SMAT:
SKY smashed 82 runs off just 29 balls while chasing a massive target of 198 against Gujarat.
60* (21) vs Hyderabad
82 (29) vs GujaratThis is strongest statement by SKY to the selectors 🥶🔥 https://t.co/wKNqBn00iw
— Indian Cricket Ministry (@Tejashyyyyyy) November 16, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav: సెలక్టర్ జహా బైట్తా హై, వహి మార్నా హై.. ఎంఎస్ ధోనీ ఫిల్మ్ ప్రేరణతో రాణిస్తున్న సూర్య
Rahul Gandhi | అమ్మ భయపడటం నా జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదు : రాహుల్‌గాంధీ
విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వంటమనిషి..? బాలికల గురుకుల స్కూల్లో కలకలం
KTR | తెలంగాణ ఉద్యమ పాదయాత్రకు 15 ఏళ్లు.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కేటీఆర్
Rahul Gandhi | నేను నా గర్ల్‌ఫ్రెండ్‌తో రెస్టారెంట్‌కు వెళ్లా.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

