Global Summit | ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ను వెంటనే వాయిదా వేయాలి.. సీఎంకు మేధావుల బహిరంగ లేఖ
Global Summit | ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'ను వెంటనే వాయిదా వేయాలి అని పౌర సమాజ నేతలు, మేధావులు డిమాండ్ చేశారు.
Global Summit | ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ను వెంటనే వాయిదా వేయాలి అని పౌర సమాజ నేతలు, మేధావులు డిమాండ్ చేశారు. ఈ మేరకు 400 మందికి పైగా సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తీవ్రమైన ఎల్‌నినో కరువు ఉండగా, రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 365 మండలాల్లో కరువు నెలకొన్నప్పుడు విదేశీ సదస్సులు అవసరమా అంటూ నిలదీశారు. జనం దాహంతో అల్లాడుతుంటే 4 వేల మంది అతిథులకు ఫైవ్‌స్టార్ విలాసాలు ఎందుకు? అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటి ఎద్దడితో స్కూళ్లు, హాస్టళ్లు మూతపడుతుంటే భారత్ ఫ్యూచర్ సిటీలో వేడుకలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరువు సహాయక చర్యలను గాలికొదిలేసి ఉన్నతాధికారులను అతిథుల సేవలకు మళ్లించడంపై మేధావులు మండిపడ్డారు. విదేశీ ప్రతినిధులకు ఐఏఎస్, ఉన్నతాధికారులను లైజన్ ఆఫీసర్లుగా నియమించడం పరిపాలనా వైఫల్యమేననని పేర్కొన్నారు. ప్రజాధనం, నీరు, విద్యుత్‌ను పూర్తిగా కరువు నివారణకే కేటాయించాలని పౌర సమాజం డిమాండ్ చేసింది. లేఖపై సంతకాలు చేసిన ప్రొఫెసర్ శాంతా సిన్హా, ఆకునూరి మురళి, ఇ.ఎ.ఎస్. శర్మ తదితర ప్రముఖులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Global Summit | ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ను వెంటనే వాయిదా వేయాలి.. సీఎంకు మేధావుల బహిరంగ లేఖ
Premada Oorali | రూ. 139 కోట్ల బాక్సాఫీస్ సంచలనం.. ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమద ఊరలి’!
Delhi High Court: 3 వారాల డెడ్‌లైన్.. కేజ్రీ టీమ్‌కు ఢిల్లీ హైకోర్టు వార్నింగ్
Suryakumar Yadav: సెలక్టర్ జహా బైట్తా హై, వహి మార్నా హై.. ఎంఎస్ ధోనీ ఫిల్మ్ ప్రేరణతో రాణిస్తున్న సూర్య
Rahul Gandhi | అమ్మ భయపడటం నా జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

