Gandra Venkata Ramana Reddy | చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులు నేసిన దుస్తులను, దుప్పట్లను టెస్కో ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి విద్యా సంస్థలకు పంపిణీ చేసేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, టెస్కోకు కాకుండా కేంద్రీకృత విధానం కింద టెండర్ల ద్వారా వచ్చిన ప్రైవేట్ సంస్థలకు ఇస్తామని తెలిపిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంతో ఎంతోమంది చేనేత కార్మికుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాయన్నారు. ఈ ప్రభుత్వం వస్తే బతుకులు బాగుపడతయి అని ఓట్లేసిన కర్మానికి ఉన్నది ఉన్నది అంటే ఉన్నది పోతది.. ఉంచుకున్నది పోతదని.. అది కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టెస్కోకు ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం వల్ల కేవలం బడా వ్యక్తులకే లాభం జరుగుతది తప్ప పేద చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేనేత కుటుంబాల పొట్ట కొట్టకుండా వెంటనే టెండర్ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే చేనేత కార్మికులు నేసిన బట్టలను, దుప్పట్లను టెస్కో ద్వారా కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్ట కొట్టింది.
చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులు నేసిన దుస్తులను, దుప్పట్లను టెస్కో ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి విద్యా సంస్థలకు పంపిణీ చేసేది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ,… pic.twitter.com/AwsUSSySXY
— BRS Party (@BRSparty) April 2, 2026
Ganneruvaram | ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు నిరసనగా గన్నేరువరం గ్రామ సభలో కంకర తట్టతో వినూత్న నిరసన
‘సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’
‘ఐటీసీ చర్చలకు రాకపోతే పోరాటం మరింత ఉధృతం’
కిన్నెరసాని వాగు నుండి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత