Minerva Hotel | హైదరాబాద్ : బేగంపేటలోని మినర్వా హోటల్లో సిబ్బంది నిర్వాకం వెలుగు చూసింది. ఆకలితో ఉందని భోజనం చేసేందుకు వెళ్లిన ఇద్దరు స్నేహితులకు చేదు అనుభవం ఎదురైంది. తాము ఆర్డర్ చేసిన సాంబార్ రైస్‌లో బొద్దింక ప్రత్యక్షమవడంతో వారిద్దరూ షాక్‌కు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. జీఎస్ రాణా అనే యువకుడు తన స్నేహితుడు సురేశ్‌తో కలిసి బేగంపేట టూరిజం ప్లాజాలోని మినర్వా హోటల్లో లంచ్ చేసేందుకు వెళ్లారు. ఇద్దరూ కలిసి సాంబార్ రైస్‌ను ఆర్డర్ చేశారు. ఇక భోజనం ఆరగిస్తున్న క్రమంలో ఆ రైస్‌లో నుంచి బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో షాక్‌కు గురైన వారిద్దరూ హోటల్ మేనేజ్మెంట్కు, ఫుడ్ సేఫ్టి అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ఎంతో పేరు కలిగిన మినర్వా హోటల్లో పరిశుభ్రత పాటించకపోవడం దారుణమన్నారు. ఆహారంలో బొద్దింకలు రావడం సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని, ఆరోగ్యానికి హానీ కలుగుతుందన్నారు. ఈ ఘటనపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టి అధికారులను కోరుతామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | కేపీహెచ్బీలో ఘోర అగ్నిప్రమాదం.. టిఫిన్ సెంటర్లో చెలరేగిన మంటలు : వీడియో
Harsha Bhogle | పీఆర్ ఏజెన్సీలను బ్యాన్ చేయాలి.. బీసీసీఐకి హర్షా భోగ్లే రిక్వెస్ట్..!
KTR | ఫార్ములా ఈ కార్ రేసు.. ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ