హైదరాబాద్ : కేపీహెచ్బీ కాలనీలో(KPHB colony) ఘోర అగ్నిప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. ఓ టిఫిన్ సెంటర్లో అర్ధరాత్రి ఒక్కసారిగా చెలరేగిన మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 2 బైకులు, హోటల్ ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘోర అగ్నిప్రమాదం.. టిఫిన్ సెంటర్లో చెలరేగిన మంటలు
హైదరాబాద్ – KPHB కంచుకోట టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం.. అర్ధరాత్రి ఒక్కసారిగా చెలరేగిన మంటలు
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన స్థానికులు
ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది
ఈ ప్రమాదంలో… pic.twitter.com/GJQheCVJNJ
— Telugu Scribe (@TeluguScribe) January 16, 2025