Harsha Bhogle | వరుస ఓటములు భారత క్రికెటర్లకు ఇబ్బందికరంగా మారాయి. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లోనూ ఓటమిపాలైంది. అంతకు ముందు శ్రీలంకలో వన్డే సిరీస్‌లోనూ ఓటడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆటగాళ్లపై బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నది. ఈ క్రమంలో కొత్తగా కఠిన నియమాలను ఆంక్షలను అమలులోకి తీసువచ్చే అవకాశం ఉన్నది. విదేశీ పర్యటనలో ఆటగాళ్లు కుటుంబాలతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తమ కుటుంబాలతో గడిపే సమయాన్ని బీసీసీఐ పరిమితం చేయనున్నది.
కుటుంబీకులు 45 రోజుల పర్యటనలో 14 రోజుల కంటే ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఇవ్వబోవడం లేదని తెలుస్తున్నది. అలాగే, టోర్నీ అంతకంటే తక్కువగా ఉంటే.. వారానికే అనుమతి ఉంటుంది. అదే సమయంలో టీమ్ ప్రయాణ సమయంలో రూల్స్‌ను తీసుకువచ్చింది. అలాగే, జట్టు ప్రయాణం విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. జట్టు ఒకేసారి ప్రయాణించాలని.. వేర్వేరుగా ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వడం లేదని సమాచారం. భారత క్రికెట్లో రోజు రోజుకు చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే స్పందించారు. బీసీసీఐ కొత్తగా అమలు చేస్తున్న రూల్స్ బాగానే ఉన్నప్పటికీ.. పీఆర్ ఏజెన్సీలను నిషేధించాలని ఆయన బీసీసీఐకి సూచించారు. బీసీసీఐ భారత క్రికెట్లో చేస్తున్న మార్పుల గురించి చదివేందుకు బాగానే ఉందని.. కానీ, వాటిని ఎంత వరకు నమ్మాలో తనకు తెలియదన్నారు.
అయితే, ఓ రూల్‌పై తప్పనిసరిగా చెప్పాలనుకుంటున్నానన్నారు. ఒక వేళ వర్తింపజేయాల్సి వస్తే.. ఆటగాళ్ల పీఆర్ ఏజెన్సీలు లేకుండా నిషేధించాలన్నారు. హర్ష భోగ్లే చేసిన కామెంట్స్‌లో కొంత వరకు వాస్తవం ఉన్నది. సోషల్ మీడియాలో ఆటగాళ్ల పీఆర్ ఏజెన్సీల హవా కొనసాగుతుంది. ఎవరైనా విమర్శిస్తే అభిమానుల పేరుతో పీఆర్ ఏజెన్సీలు వారిని ట్రోల్స్ చేస్తుంటాయి. ఏదైనా సిరీస్‌లో ఎవరైనా క్రికెటర్ విఫలమైతే.. వారిని ఎవరైనా విమర్శిస్తే.. జట్టులో నుంచి తప్పించకుండా గతంలో సాధించిన రికార్డులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ తాజాగా హర్షా భోగ్లే చేసిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Reading of the changes the BCCI is apparently suggesting for the Indian team. I don’t know how much to believe but if I had to nominate one rule to be strictly applied, it would be to ban team members from having PR agencies
— Harsha Bhogle (@bhogleharsha) January 15, 2025