MLC dasoju shravan kumar | కేటీఆర్ ఉద్యోగాలు పెంచితే.. రేవంత్ రెడ్డి ఉద్యోగాలను మింగేస్తున్నాడు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
mlc dasoju shravan kumar, | ఐటీ మీద ఆధార పడుతున్న వారి పరిస్థితి ఏమిటీ..? దావోస్ పోయి పెద్దపెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులపై శ్వేత పత్రం ప్రకటించాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజ్ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు.
MLC dasoju shravan kumar | హైదరాబాద్ అనగానే ఒకప్పుడు చార్మినార్ గుర్తొచ్చేది ..ఇపుడు ఐటీ ,ఫార్మా పరిశ్రమలకు హైదరాబాద్ పేరు గాంచిందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. వేగంగా పురోగమిస్తున్న నగరాలలో హైదరాబాద్ ఒకటిగా ఉన్న పరిస్థితి నుంచి రేవంత్ పాలనలో దిగజారే దాకా వెళ్తోందన్నారు. 2014లో 50 వేల కోట్ల రూపాయలు ఉన్న ఐటీ ఎగుమతులను 2023లో 2 లక్షల కోట్లు దాటేలా కేటీఆర్ శ్రమించారు. 3 లక్షల ఐటీ ఉద్యోగాల స్థాయి నుంచి కేటీఆర్ 9 లక్షల ఐటీ ఉద్యోగాల స్థాయికి కేటీఆర్ హైదరాబాద్‌ను మార్చారు.. ఇపుడు అందరూ సిగ్గుపడేలా పరిస్థితి మారింది. రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడి ఐటీ పరిశ్రమను చంపేసే పని చేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ కు కాగ్నిజెంట్ రాం రాం అన్నది.. 15 వేల నుంచి 20 వేల ఉద్యోగాలు కల్పించే కాగ్నిజెంట్ విశాఖకు తరలుతోంది. కాగ్నిజెంట్‌ను రెండు చోట్ల విస్తరించేలా గతంలో రెండు ఎంఓయూలు కుదిరాయి. అయినా కాగ్నిజెంట్ హైదరాబాద్ నుంచి విశాఖకు మారుతోంది. లోకేష్ దగ్గర ఉన్న మంత్ర దండం ఏమిటీ..? రేవంత్ దగ్గర లేని దేమిటీ..?
.. హైదరాబాద్ లో లేనిది విశాఖలో ఏముంది ? కేటీఆర్ హయాంలో ఐటీ పరిశ్రమ వృద్ధి చెందింది ఎట్లా..? రేవంత్ హయాంలో దిగజారుతోంది ఎట్లా ? అని దాసోజు శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.
7 వేల ఐటీ ఉద్యోగాలు తగ్గాయని భట్టి అసెంబ్లీలోనే చెప్పారు. రేవంత్ రెడ్డి ఉద్యోగాలను మింగేస్తున్నారు. కేటీఆర్ సగటున 60 వేల ఉద్యోగాలు పెంచితే రేవంత్ రెడ్డి 6 వేల ఉద్యోగాలు తగ్గిస్తున్నాడు. ఇప్పటికే లక్షా 20 వేల ఉద్యోగాలు కోల్పోయాం. మంత్రి శ్రీధర్ బాబు పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుకలా తయారైంది.. మాట్లాడితే మంత్రి పదవి పోతుంది అనే భయం
.. తెలంగాణ రైసింగ్ కాదు ..రేవంత్ రెడ్డి ఆయన ఫామిలీ రైజింగ్.. రియల్ ఎస్టేట్ దందాలతో రేవంత్ సంపాదించుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చప్రాసా..?
ఐటీ మీద ఆధార పడుతున్న వారి పరిస్థితి ఏమిటీ..? దావోస్ పోయి పెద్దపెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులపై శ్వేత పత్రం ప్రకటించాలని దాసోజ్ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. దుర్గం చెరువు దగ్గర నిర్మాణ వ్యర్థాల కుప్ప పెద్దది అవుతోంది. మరో జవహర్ నగర్ డంప్ యార్డ్ తయారవుతోంది. కేటీఆర్ హయాంలో టీఎస్ఐ పాస్‌తో 18 లక్షలకుపైగా ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వచ్చాయి. కాళేశ్వరం నీళ్లు ఆంధ్రాకే.. ఐటీ పరిశ్రమలు ఆంధ్రకేనా..? రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రా ?ఆంధ్రాకు ముఖ్యమంత్రా ? లేక ఏపీ సీఎం చప్రాసా?
జాబ్ క్యాలెండర్ ఏమైంది..? నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే గొడ్లను బాదినట్టు బాదుతున్నారు..హిట్లర్ పాలనతో పెట్టుబడులు వస్తాయా ? .. సీఎం రక్తం ,బూతు భాషలతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా.. ? కాళేశ్వరంతో నీళ్లు ఇయ్యమంటే రక్తం కావాలంటాడు..గోదావరి జలాలు లిఫ్ట్ చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుందని రేవంత్ భయపడుతున్నాడు
..రైతులు ట్యాంకర్లతో తమ పొలాలను పండించుకునే దుస్థితికి రేవంత్ తెలంగాణను మార్చాడు. కేసీఆర్ తెలంగాణ ఖ్యాతిని పెంచితే రేవంత్ తుంచుతున్నాడు. తెలంగాణ భవిష్యత్ ను రేవంత్ ఫణంగా పెడితే చరిత్ర క్షమించదు. ఈ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నేతలు ముఖీబ్ చాందా, నిఖిల్ ఐనేని ,లక్ష్మి నరసింహ రెడ్డి పాల్గొన్నారు.
Live: తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ @sravandasoju మీడియా సమావేశంhttps://t.co/chC4w74rLf
— BRS Party (@BRSparty) July 15, 2026
Read Also :
Singireddy Niranjan Reddy | సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల అరెస్టు అప్రజాస్వామికం : నిరంజన్ రెడ్డి
Pawan Kalyan | ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్.. అన్నా లెజినోవా భావోద్వేగ పోస్ట్!
Nirmal | నిర్మల్‌లో కలకలం.. యువకుడిని దారుణంగా హత్యచేసిన దుండగులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

