Harish Rao | ఈ రాష్ట్రప్రభుత్వం ఒక దయలేని ప్రభుత్వం. అసలు దివ్యాంగుల మీద దయ లేని ప్రభుత్వం ఓ ప్రభుత్వమేనా..? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అడిగారు. ఆనాడు కేసీఆర్‌ను రూ.4,016 చేయమని మీరడగలేదు. ఆయన మనసెరిగి రూ.500 ఉన్న పెన్షన్‌ను రూ.4,016 చేసింది కేసీఆర్. అంటే ఎనిమిదింతలు పెరిగినట్టు. మరి రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి అన్నా పెంచిండా..? అని ప్రశ్నించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో హస్తినాపురంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, దివ్యాంగుల హక్కుల సాధనకై నిర్వహించిన ‘సమర శంఖారావం’లో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్లో హౌసింగ్‌లో 5 శాతం దివ్యాంగులకు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. విద్యా, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలోనే దివ్యాంగుల చట్టాన్ని అద్భుతంగా అమలు చేసి ఇండియాలోనే ది బెస్ట్ స్టేట్‌గా అవార్డు పొందింది కూడా కేసీఆర్ ప్రభుత్వమన్నారు.
2017-18లో దివ్యాంగుల చట్టాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందుగా అమలు చేసిన రాష్ట్రంగా ఆనాడు మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవార్డు వచ్చిందన్నారు హరీశ్ . అట్లా కేసీఆర్ మిమ్మల్ని ఒక కుటుంబసభ్యుడిగా ఒక మనసుతో ఆలోచించిండు. మీ కష్టాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టే రూ.రూ.4,016 పెన్షన్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల రూపంలో 54 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మా దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ డబ్బులు 10,300 కోట్ల రూపాయలు ఆసరా రూపంలో కేసీఆర్ అందించారని పేర్కొన్నారు.
నెలనెలకు కరెక్టుగా ఇచ్చేవాళ్లు. కాంగ్రెస్ వచ్చినంక పెంచింది లేదు..కానీ మధ్యలో 2-3 నెలల పెన్షన్ మాత్రం ఎగ్గొట్టిండు. ఓ నెల 25 తారీఖు పోతది.. మరో నెల 30 తారీఖు పోతది.. అలా ఒక నెల ఎగిరిపోతది.. మొన్ననే 1 తారీఖు వచ్చింది అంటరు. అట్లా 2-3నెలల పెన్షన్ ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తిండు.
దివ్యాంగుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి దయలేదు.
దివ్యాంగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేదు.
రూ. 500 ఉన్న దివ్యాంగుల పెన్షన్‌ను కేసీఆర్ గారు రూ. 4,016 చేసిండు. రిజర్వేషన్లను పెంచిండు.
దివ్యాంగుల చట్టాన్ని మొట్టమొదటిగా అమలుచేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం అవార్డు… pic.twitter.com/PCXn3UaoqY
— BRS Party (@BRSparty) August 29, 2026
సెప్టెంబర్ 1న ఉమ్మడి నల్లగొండ జిల్లా జూనియర్ బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు
Suryapet News | వేపచెట్టు వివాదం.. రెండు నిండు ప్రాణాలు బలి.. ఎస్ఐకి గాయాలు!