బూర్గంపహాడ్, సెప్టెంబర్ 10 : బూర్గంపహాడ్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు బాధితులకు సారపాకకు చెందిన ముస్లిం ఎంపర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్(మేవా) ఆధ్వర్యంలో గురువారం వైద్య ఖర్చుల కోసం రూ.5 వేల చొప్పున రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. బూర్గంపహాడ్కు చెందిన బీమయ్య గుండె సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్నాడు. అదేవిధంగా ఆటో డ్రైవర్ జానీ అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఈ విషయాన్ని మేవా సొసైటీకి స్థానికులు తీసుకువెళ్లారు. దీంతో మేవా వెల్ఫేర్ సొసైటీ నుండి నిరుపేద కుటుంబానికి చెందిన వారికి వైద్య ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించినట్లు బాధ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేవా అధ్యక్షుడు మహ్మద్ ముస్తఫా, సోహెల్ పాషా, గ్రామ పెద్ద దస్తగిరి పాల్గొన్నారు.