SIR Notice: సీఎం శివకుమార్ తల్లి, నిలేఖనీ, జిరోదా కుటుంబాలకు సర్ నోటీసులు
SIR Notice: సీఎం శివకుమార్ తల్లి గౌరమ్మ ఓటు మిస్సైంది. దీంతో ఆమెకు నోటీసులు ఇచ్చారు. నందన్ నిలేఖనీ, జిరోదా వ్యవస్థాపకులకు కూడా కర్నాటకలో సర్ నోటీసులు జారీ చేశారు. అధికారులే ఇంటికి వెళ్లి వారి నుంచి సమాచారాన్ని సేకరించనున్నారు.
బెంగుళూరు: కర్నాటకలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఓట్లను నమోదు చేసుకున్న వారిలో తప్పులు ఉంటే వారికి నోటీసులు ఇస్తున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ ఫౌండర్ నందన్ నిలేఖనీతో పాటు ఆయన కుటుంబానికి, జిరోదా వ్యవస్థాపకులు నితిన్ కామత్, నిఖిల్ కామత్‌లకు, కర్నాటక సీఎం శివకుమార్ తల్లి గౌరమ్మకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. సీఎం శివకుమార్ తల్లికి కనకపుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు ఉన్నది. అయితే ఆ పేరుతో మిస్‌మ్యాచ్ అయినట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది.
ఇక నిలేఖనీ కుటుంబంలోని ఆయన భార్య , పిల్లలకు కూడా గత 2002 సర్‌తో మ్యాపింగ్ జరగలేదని ఆరోపణలు ఉన్నాయి. నితిన్ కామత్, నిఖిల్ కామత్, వారి తల్లి రేవతి కామత్‌కు.. బెంగుళూరు సౌత్ అసెంబ్లీ నియోజకవర్గంలో పేరెంట్స్ నేమ్ మిస్‌మ్యాచ్ అయ్యింది. అయితే ప్రముఖ వ్యక్తులు, వీఐపీలను వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా ఇబ్బందిపెట్టబోమని అధికారులు అన్నారు. వారి ఇంటికి సిబ్బంది వెళ్లి వివరాలను సేకరించనున్నట్లు అధికారులు చెప్పారు.
నోటీసులు జనరేట్ చేసినా, అధికారులు మాత్రం ఇంకా వారికి పంపలేదని తెలుస్తోంది. పేరు తప్పు పడిన అంశంలో భారతరత్న గ్రహీత ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు పేరిట నోటీసులు జనరేట్ చేశారు. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్‌కు 2002 సర్ లిస్టుతో మ్యాపింగ్ జరగలేదని కూడా నోటీసును జనరేట్ చేశారు. అధికారిక స్థాయిలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

