అమరావతి : వైసీపీ మాజీ మంత్రి, ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ) కంట తడిపెట్టారు. ఇటీవల బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను ) వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా గరివిడి మండలం వైసీపీ కార్యాలయంలో గురువారం బొత్స ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీ నిర్వహణ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ చిన్న శ్రీను సేవలను కొనియాడుతూ ప్రశంసలతో ముంచెత్తారు. ఆయనతో అనుబంధాన్ని కార్యకర్తలు గుర్తు చేసుకున్న సందర్భంగా బొత్స కంటతడి పెట్టారు. సభలో భావోద్వేగ వాతావరణంలో కార్యకర్తలు కూడా కంటతడి పెట్టారు.