Polytechnic Students | తమ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసేలా జీవో తీసుకొచ్చిన రేవంత్ సర్కార్‌పై పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కి జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడుతున్నారు. డిప్లొమా విద్యార్థులు హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి, నిర్లక్ష్య ధోరణిపై నిరసన చేపడుతున్నారు.
గురువారం హైదరాబాద్రాలోని మంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిరసన చేస్తున్న విద్యార్థులను భారీ తాళ్ల సాయంతో అదిమిపట్టే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు ఒక్కసారిగా పోలీసులను ఎదురించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో పలువురు విద్యార్థులు కిందపడిపోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో పాలిటెక్నిక్ కాలేజీలో యుద్ద వాతావరణం నెలకొంది.
హైదరాబాద్ – రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్రిక్తత
విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట
తోపులాటలో కిందపడిపోయిన విద్యార్థులు
మీడియాను లోపలికి అనుమతించని పోలీసులు pic.twitter.com/gt85R192wl
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026
US Planes: జోర్డాన్‌పై దాడిలో పలు అమెరికా విమానాలు ధ్వంసం !
Khelo India Kho-Kho | ఉమ్మడి వరంగల్ జిల్లా.. ఖేలో ఇండియా ఖో ఖో జట్ల ఎంపికలు
Mandadi Review | ‘మండాడి’ మూవీ రివ్యూ.. సూరి, సుహాస్‌ల యాక్షన్ డ్రామా ఎలా ఉంది?