Job Notification | టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వే జాబ్స్.. 1688 ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
Job Notification | రైల్వే (Railway) లో కొలువు సాధించాలనుకునే నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త అందించింది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో 1,688 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. పదోతరగతి, ఇంటర్మీడియట్ (Intermediate) అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Job Notification : రైల్వే (Railway) లో కొలువు సాధించాలనుకునే నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త అందించింది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో 1,688 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. పదోతరగతి, ఇంటర్మీడియట్ (Intermediate) అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైన్ క్లర్క్ (Train Clerk), టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వంటి వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలని ఆర్ఆర్బీ స్పష్టంచేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 13 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ-1, సీబీటీ-2) నిర్వహించి, మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in సందర్శించాలని అధికారులు సూచించారు. అర్హులైన వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

