అమరావతి : ఏపీలోని గుంటూరు( Guntur ) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఐపీడీ కాలనీలో నివసిస్తున్న హరికృష్ణ డయాలసిస్ కోసం కొడుకు అఖిలేష్‌తో కలసి కారులో ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మరికొద్ది నిమిషాల్లో అపార్ట్‌మెంట్‌కు చేరుకునే సమయంలో కారు ( Car Fire ) భారీ శబ్ధంతో పేలిపోయింది.
పేలుడి శబ్ధానికి కారు డోరుల లాక్ అయ్యాయి. పేలుడికి మంటలు రావడంతో స్థానికులు కారు ముందు అద్దాలను ధ్వంసం చేసి కుమారుడిని స్వల్పగాయాలతో కాపాడగా కారులో మంటలు తీవ్రంగా కావడంతో వెనుకసీట్లో తండ్రి హరికృష్ణను రక్షించలేకపోయారు. దీంతో తండ్రి కారులోనే సజీవదహన ( Burnt Alive ) మయ్యాడు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.