హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 10 : ఈనెల 12న హనుమకొండ జవహర్ లాల్ స్టేడియం(జే ఎన్ ఎస్)లో ఉదయం 9 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఖో ఖో సంఘం ఆధ్వర్యంలో ఖేలో ఇండియా ఖో ఖో బాలబాలికల ఎంపికలు ఉంటాయని ఉమ్మడి వరంగల్ జిల్లా ఖో ఖో సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాం ప్రసాద్ తెలిపారు. ఆసక్తి కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఖో ఖో క్రీడాకారులు హాజరుకావాలని ఇందులో ఎంపికైన బాల బాలికలు రాష్ట్రస్థాయిలో జరిగే ఖేలో ఇండియా ఖో ఖో ఎంపికలలో పాల్గొంటారని శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు.
క్రీడాకారులు 01.01.2008 నాడు గాని లేదా తర్వాత గాని జన్మించి ఉండాలని, ఆసక్తి గల క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రము, ఆధార్ కార్డు ఎంపికల సమయంలో సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు జవహర్ లాల్ స్టేడియం ఖో ఖో శిక్షకులు రాజారపు రమేష్ ( 9963336559 ), ఈ ఎంపికల ఇంచార్జ్ మనుపాటి రమణ, సంయుక్త కార్యదర్శి ( 9177169477 ) సంప్రదించాలని కోరారు.